రాత్రి 11.30కి ఆ పోస్టు చేసి షాక్!: బీజేపీ ఎమ్మెల్యే ఫేస్‌బుక్ ఖాతాలో అశ్లీల వీడియో..
రాత్రి 11.30గం. సమయంలో రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో పోస్టవడంతో.. ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఫేస్‌బుక్ పేజీలో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది. ఇద్దరు యువకులు ఓ యువతిపై అత్యాచారానికి యత్నిస్తుండగా.. వద్దంటూ ఆమె వారిని వేడుకుంటున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియోతో తమకెలాంటి సంబంధం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని ఇగ్గాస్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్ ఫేస్ బుక్ ఖాతాలో ఈ వీడియో పోస్టయింది. రాత్రి 11.30గం. సమయంలో రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియో పోస్టవడంతో.. ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్.. ఇది తమ చర్య కాదని వివరణ ఇచ్చారు.

బుధవారం రాత్రి తాను ఢిల్లీలో ఉన్నానని, రాష్ట్రపతి ఎంపిక గురించి జరిగిన చర్చలో భాగంగా బీజేపీ నేతల సమావేశంలో పాల్గొన్నానని తెలిపారు. తిరిగి తెల్లవారుజాము 2.30గం.కు ఇంటికి వచ్చానని పేర్కొన్నారు. తనపై రాజకీయ కక్షతోనే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. కావాలనే తన ఖాతాను హ్యాక్ చేసి.. అశ్లీల వీడియో పోస్టు చేశారని ఆరోపించారు.
అలీఘడ్ సీనియర్ ఎస్పీ రాజేశ్ కుమార్ పాండేను కలిసి దీనిపై ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్పీ స్పందిస్తూ.. ఐపీ అడ్రస్ ద్వారా నిందితులను పట్టుకుని, వారిపై కేసు నమోదుచేస్తామన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications