Singer Suicide: భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!
Singer Suicide: ఇటీవల భార్యల వేధింపులతో భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాలు, భార్య, ఆమె కుుటంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగ్గర్నాట్ గా ప్రసిద్ధి చెందిన ఒడియా ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులోని కడుబీసనహళ్లిలో అపార్ట్ మెంట్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. అభినవ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యతో తలెత్తిన వివాదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అభినవ్ భార్య వేధింపుల వల్లే చనిపోయాడా? వేరే ఇతర కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టుమార్టం అనంతరం అభినవ్ భౌతిక కాయాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. అభినవ్ సింగ్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అభినవ్ సింగ్ ఆత్మహత్య విషయంలో భార్య, మరో 10 పేర్లను ఫిర్యాదులు బాధితుడి తండ్రి చేర్చారు. అభినవ్ సింగ్ ఒడియా ర్యాప్ సాంగ్స్ తో ఫేమస్ అయ్యాడు. ఆయన పాట కథక్ ఆంథమ్ సాంగ్ సూపర్ హిట్ గా నిలవడంతో మరింత పాపులర్ అయ్యాడు. అతను చాలా మంది ప్రసిద్ధ కళాకారులతో కలిసి పని చేశాడు.












Click it and Unblock the Notifications