మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై రాత్రి సమయంలోనూ పని చేసుకోవచ్చు.. కానీ..
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాత్రి షిఫ్టుల్లోనూ మహిళలకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఒడిశాలోని లేబర్ అండ్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. నైట్ ఫిఫ్టుల్లో పని చేయాలనుకుంటున్న మహిళలు కన్ సెంట్ లేఖ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే రాత్రి సమయాల్లో పని చేసే మహిళల కోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ప్రకటించింది.
మహిళల ఆర్థిక సాధికారత కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని మహిళలు నైట్ షిఫ్టుల్లోనూ పనిచేయవచ్చని పేర్కొంది. పరిశ్రమలు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఈ మేరకు ఒడిశాలోని లేబర్ అండ్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్‌మెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ జారీ చేసింది. అలాగే నైట్ ఫిఫ్టుల్లో పని చేయాలనుకుంటున్న మహిళలు కన్ సెంట్ లేఖ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే ఒడిశాలోని షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్స్ యాక్ట్ ను సవరించిన వివరాల ప్రకారం.. నైట్ షిఫ్ట్ చేయాలను కునే మహిళలకు ఆ కార్యాలయంలో ఆ షిఫ్టులో కనీసం ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉండాల్సి ఉంటుంది. మహిళా ఉద్యోగుల రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ తో కూడిన వాహనంలో రవాణా సౌకర్యం కల్పించాలి. అయితే యుక్త వయసులో ఉన్న మహిళలకు ఈ అనుమతి లేదు. ఇక పని ప్రదేశానికి దగ్గరలోనే వాష్ రూమ్, తాగునీటి సౌకర్యాలు కల్పించాలి. సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండాలి. అలాగే ఈ నైట్ షిఫ్ట్ చేయాలను కునే మహిళలు కన్ సెంట్ లేఖ సమర్పించాలి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications