ఆ డ్యాన్స్‌కు యూట్యూబ్ షేక్: కాలేజీ గర్ల్స్ స్టెప్స్‌కు 12 మిలియన్ వ్యూస్(వీడియో)
ఐటీ సంస్థల్లోను, కాలేజీల్లోను యువత ఫ్లాష్ మాబ్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశాకు చెందిన ఓ కాలేజీ గర్ల్స్ ఫ్లాష్ మాబ్ తో దుమ్మురేపారు.
భువనేశ్వర్: ఫ్లాష్ మాబ్ అనేది ఇప్పుడో నయా యూత్ ట్రెండ్. మాల్స్, రోడ్స్, కాలేజీలు.. ఇలా ఎక్కడైనా సరే ఒక గ్రూప్ సభ్యులంతా కలిసి డ్యాన్స్ చేయడమే ఫ్లాష్ మాబ్. ఏదైనా సామాజిక చైతన్యం కోసమో.. లేక యువతలో ఉత్సాహాన్ని నింపేందుకో ఈమధ్య కాలంలో ప్రతీ చోట ఫ్లాష్ మాబ్ ప్లాన్ చేస్తున్నారు.
ఐటీ సంస్థల్లోను, కాలేజీల్లోను యువత ఫ్లాష్ మాబ్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒడిశాకు చెందిన ఓ కాలేజీ గర్ల్స్ ఫ్లాష్ మాబ్ తో దుమ్మురేపారు. వీరి డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో ఎంతలా హిట్ అయిందంటే.. ఏకంగా 12కోట్ల పైచిలుకు జనం ఇప్పటివరకు దాన్ని వీక్షించారు. ఫ్లాష్ మాబ్‌లో యువతులు చేసిన డ్యాన్స్ నెటిజెన్స్‌ను ఆకట్టుకోవడంతో.. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
ప్రభుదేవా కెరీర్‌లో ఎవర్ గ్రీన్‌గా నిలిచిపోయిన ముక్కాలా ముక్కాబులా మొదలు పలు బాలీవుడ్ పాటలకు అనుగుణంగా యువతులు స్టెప్స్ వేశారు. తొలుత ఒక్కరితో మొదలై.. తర్వాత అంతా కలిసి డ్యాన్స్ చేశారు. మొత్తానికి ఫ్లాష్ మాబ్ ట్రెండ్ యువతను ఎంతలా హోరెత్తిస్తుందో చెప్పడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ.












Click it and Unblock the Notifications