Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒడిశా రైలు ప్రమాదానికి పక్కనే ఉన్న మసీదు కారణం అని ట్వీట్, లేడీ లీడర్ కు !

బెంగళూరు: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మందికి పైగా మరణించారు మరియు 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు, ఈ ప్రమాద దర్యాప్తు చేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

అయితే ఇలాంటి రైలు ప్రమాదంలోనూ కొందరు దుర్మార్గులు రాజకీయాలు చేస్తున్నారు. ఈ రైలు ప్రమాదానికి మసీదులే కారణమంటూ కొందరు ఫొటోలను షేర్ చేశారు. ఒడిశా రైలు ప్రమాదం విషాదానికి మత రంగు పులుముకునే పనులను కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఒడిశా పోలీసులు తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.

Odisha Police warns Karnataka lady BJP leader who tweeted that mosque was cause of Odisha train accident

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు హెచ్ఎస్. శకుంతల అనే మహిళ కూడా అలాంటి పోస్ట్‌ను షేర్ చేయడంతో ఒడిశా పోలీసులు ఆ మహిళ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే పోస్టులను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసులు హెచ్చరించారు. దీంతో బీజేపీ కార్యకర్త శకుంతల న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యారు. అప్పటికే శకుంతల ఆమె చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు.

అయితే శకుంతల చేసిన ట్వీట్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశా పోలీసులు కర్ణాటక పోలీసుల నుండి శకుంతల గురించి సమాచారాన్ని సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు కూడా ఈ ఫోటోను షేర్ చేశారని, అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలను షేర్ చేసి నమ్మవద్దని కోరారు.

Odisha Police warns Karnataka lady BJP leader who tweeted that mosque was cause of Odisha train accident

రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉందని కొందరు ఫోటోను షేర్ చేశారు. అయితే ప్రమాదానికి దూరంగా ఉన్న ప్రదేశం మసీదు కాదని ఇస్కాన్ దేవాలయమని తెలిసింది. గుడిలో సగం మాత్రమే ఫోటో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసి దానిని మసీదుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం ఒడిశా పోలీసులు తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై డేగ కన్ను వేశారు.

ఎలాంటి గందరగోళం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసు అధికారులు హెచ్చరించారు. అయితే చేసిన తప్పు గ్రహించిన శకుంతల పోలీసుల పట్టుకుంటారనే భయంతో ఇప్పటికే రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయి అరెస్టు కాకుండా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+