ఒడిశా రైలు ప్రమాదం, మార్చురీలో శవాల కుప్పలో బతికున్న కొడుకును చూసి !
భువనేశ్వర్/హౌరా: ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించిన బాధాకరమైన కథనాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇదే సమయంలో దారుణమైన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కొడుకును రక్షించేందుకు తండ్రి అంబులెన్స్‌లో 230 కిలోమీటర్లు ప్రయాణించాడు. కొడుకు శవానన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన తండ్రి చివరకు మార్చురీలో మృతదేహాల కుప్పలో నుంచి సజీవంగా ఉన్న కొడుకును బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించడం కలకలం రేపింది.
రెండు రోజుల నిరంతర అన్వేషణ, పట్టుదలతో కొడుకు ప్రాణాలను కాపాడిన తండ్రిని అందరూ అభినందిస్తున్నారు.
హౌరాలో దుకాణం నినర్వహిస్తున్న షాప్ యజమాని హేలారామ్ అతని కొడుకు బిస్వజీత్ మాలిక్ (24)ను రక్షించిన థ్రిల్లింగ్ సంఘటన వెలుగు చూసింది. తన కొడుకును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కించి మనాకి తిరిగి వచ్చిన తర్వాత తండ్రికి రైలు ప్రమాదం జరిగిన వార్త తెలిసింది. వెంటనే కొడుకు బిస్వజీత్ మాలిక్ కు అతని తండ్రి ఫోన్ చేశాడు.

కాల్‌ను స్వీకరించిన బిశ్వజిత్, తాను తీవ్రంగా గాయపడ్డాడని, తాను ఎక్కడ ఉన్నానో తెలియదని చెప్పాడు. తండ్రి మళ్లీ ఫోన్ చేస్తే బిస్వజీత్ ఫోన్ రసీవ్ చెయ్యలేదు. తండ్రి హేలారామ్ మరింత షాక్ అయ్యాడు. ఆయన ఇంటికి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే చేరుకోవాలని అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో తండ్రి హేలరామ్ ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
శనివారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న అన్ని ఆస్పత్రుల్లో వెతికినా కొడుకు బిస్వజీత్ మాలిక్ ఆచూకి చిక్కలేదు. నీ కొడుకు బిస్వజీత్ చనిపోయాడని అధికారులు అతని తండ్రి హేలారామ్ కుచెప్పారు. కాబట్టి మార్చురీలో నీ కొడుకు శవం కోసం వెతకాలని హేలారామ్ కు అధికారులు సూచించారు. బహనాగాలోని ప్రభుత్వ పాఠశాలను తాత్కాలిక మార్చురీగా మార్చారు. రైలు ప్రమాదంలో మరణించిన వారిని ఈ మార్చురీకి తరలించారు. సత్వర ఆపరేషన్‌లో భాగంగా, అపస్మారక స్థితిలో బతికే ఉన్న బిశ్వజిత్ మాలిక్‌ను రెస్క్యూ సిబ్బంది మార్చురీకి తరలించారు.
బిస్వజిత్ మాలిక్ మార్చురీలో శవాల కుప్పల మధ్య పడి ఉన్నాడు. కానీ ఈ మార్చురీకి ప్రజలకు ప్రవేశం లేదు. సంఘటనను వివరిస్తూ, తండ్రి హేలరామ్ ఒక్కసారి వెతకమని అభ్యర్థించాడు. అడుగుపెట్టాక తండ్రి పోరాట పటిమ సన్నగిల్లింది. శవాల కుప్ప, కొడుకు బతికే ఉన్నాడన్న నమ్మకంతో సంఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి శవాల కుప్పలో కొడుకు బిస్వజీత్ మాలిక్ దొరుకుతాడని ఊహించలేదు. వెతుకులాట ప్రారంభించినా మొదట బిస్వజీత్ ఆచూకి చిక్కలేదు.
మార్చురీ గదిలో ఓ మూలన బిస్వజీత్ మాలిక్ అతని తండ్రి హేలారామ్ ను చూసి అతని చేతిని కదిలించాడు. వెంటనే హేలారామ్ ఆ మూలకు పరిగెత్తాడు. దగ్గరికి వచ్చేసరికి అది కొడుకు బిస్వజీతిమ మాలిక్ చెయ్యి అని తండ్రి నిర్ధారించాడు. ఇతర మృతదేహాలను పక్కకు తరలించగా బిస్వజీత్ మాలిక్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. బిస్వజీత్ మాలిక్‌ను అతని తండ్రి హేలారమ్ మార్చురీ నుండి బయటకు తీశారు, అతను వచ్చిన అదే అంబులెన్స్‌లో బాలాసోర్ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు.

తీవ్ర గాయాలు కావడంతో బిస్వజీత్ మాలిక్ ను కటక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కోల్‌కతా ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ యూనిట్‌లో బిస్వజీత్ మాలిక్ కు చికిత్స అందిస్తూ సర్జరీలు చేయించామని అతని తండ్రి హేలారామ్ స్థానిక మీడియాకు చెప్పారు. ప్రస్తుతం బిశ్వజిత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. హేలారామ్ వెళ్లడం కొన్ని గంటలు ఆలస్యం అయ్యి ఉంటే బిస్వజీత్ మాలిక్ ప్రాణాలు పోయేవని, తన కొడుకు బతికే ఉన్నాడు అని హేలారామ్ కు ముందు దేవుడు నమ్మకం కలిగించడంతో అతను ప్రాణాలతో భయటపడ్డాడని అతని బంధువులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications