ఒడిశా ఘోర రైలు ప్రమాదం: ఫ్యామిలీ సహా సిగ్నల్ జేఈ మిస్సింగ్, ఇంటికి సీబీఐ సీల్

భువనేశ్వర్: ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా అందర్నీ కలిచివేసిన తెలిసిందే. ఈ రైలు ప్రమాదానికి సంబంధించి తాజాగ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు బాలాసోర్ సెక్షన్ జూనియర్ ఇంజినీర్ అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేశారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంలో ఉద్దేశపూర్వకంగానే జోక్యం చేసుకోవడం వల్లే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు తెలపడంతో ఆ కోణంలో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే, అమీర్ ఖాన్‌ను మళ్లీ ప్రశ్నించేందుకు అతని ఇంటికి వెళ్లగా.. సిగ్నల్ జేఈ తన కుటుంబంతో సహా పారిపోయినట్లు తెలిసింది. దీంతో అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది.
జేఈ ఇంటిపై నిఘాకు ఇద్దరు అధికారులను సీబీఐ నియమించింది.

cbisealsjuniorengineershouse

కాగా, రైలు కార్యకలాపాలకు సంబంధించి సిగ్నల్ ఇంజనీర్‌గా పని చేసే అధికారుల పాత్రే కీలకం. సిగ్నల్, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్స్‌తో పాటు పలు వ్యవస్థల నిర్వహణ వీళ్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. అందుకే సీబీఐ అధికారులు జూనియర్ ఇంజనీర్‌పై కూడా విచారణ చేపట్టారు. అయితే అతను కుటుంబంతో సహా ఎందుకు కనిపించకుండా వెళ్లిపోయారనే విషయంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌ బాహానాగ రైల్వే స్టేషన్ దగ్గర కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ తోపాటు మూడు రైళ్లు ఢీకొనడంతో జరిగిన ఘోర ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వందలాది మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 2వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో నిశ్చలంగా ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది.కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు అదే సమయంలో ప్రయాణిస్తున్న బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి కొన్ని కోచ్‌లపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రైల్వే బోర్డు నిర్ణయంతో ఈ ప్రమాదంపై సీబీఐ జూన్ 6న విచారణ ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంను తారుమూరు చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రైల్వే శాఖ సీబీఐ విచారణను కోరింది.

ఆచూకీ లభ్యం

కాగా, బాలాసోర్ జేఈ అమీర్ ఖాన్ ఆచూకీ లభ్యమైందని.. అతడ్ని మంగళవారం సీబీఐ అధికారులు విచారిస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+