వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీవిని ఎరగని ప్రేమ వివాహం: పాముతో యువతి పెళ్లి..(వీడియో)

అలా పాముపై బిమ్ బాలాకు ప్రేమ ఏర్పడింది. ఇదే క్రమంలో ఇక పామునే పెళ్లి చేసుకోవాలని బిమ్ బాలా నిశ్చయించుకుంది. ఇందుకు కుటుంబ సభ్యులంతా అంగీకరించారు.

|
Google Oneindia TeluguNews

ఒడిశా: ప్రేమ వివాహం అననగానే.. కులాలు, మతాలు, జాతకాలు ఇతరత్రా గొడవలన్ని గుర్తుకొస్తాయి. మనుషులతో పెళ్లికి ఇవన్ని పట్టించుకునే సమాజంలో.. ఒక జంతువును పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం.. మనుషల ఆలోచనను స్పష్టం చేస్తోంది.

ఒడిశాలోని ఖుర్ద్ జిల్లాకు చెందిన బిమ్ బాలా అనే ఓ యువతి.. ఒక పామును ప్రేమ వివాహం చేసుకుంది. ఇందుకు ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా అండగా నిలిచారు. అయితే తీరా పెళ్లి సమయానికి పాము వరుడు గారు పుట్ట నుంచి బయటకు రాకపోవడంతో.. ఓ బొమ్మ పాముతో వివాహ తంతు పూర్తి చేయాల్సి వచ్చింది.

ఇంతకీ పాముకు-బిమ్ బాలాకు మధ్య ప్రేమ ఎలా పుట్టిందంటే!.. ఆమె ఇంట్లో ఓ పురాతనమైన పుట్ట ఉంది. అందులోంచి రోజూ ఓ పాము బయటకు వచ్చేది. అలా వచ్చిన ప్రతీసారి బిమ్ బాలా దానికి పాలు అందించేది. ఆ పాలను తాగి, కాసేపు ఆమె ఒడిలో సేదతీరి తిరిగి అది పుట్టలోకి వెళ్లిపోయేది.

అలా పాముపై బిమ్ బాలాకు ప్రేమ ఏర్పడింది. ఇదే క్రమంలో ఇక పామునే పెళ్లి చేసుకోవాలని బిమ్ బాలా నిశ్చయించుకుంది. ఇందుకు కుటుంబ సభ్యులంతా అంగీకరించారు.పాము కూడా బిమ్ బాలాను ప్రేమిస్తోందని, కాబట్టే ఆమెకు ఎలాంటి హాని తలపెట్టడం లేదని గ్రామస్తులంతా అభిప్రాయపడ్డారు.

మొత్తానికి అందరూ ఓకె చెప్పడంతో.. ఇటీవలే ఓ మంచి ముహూర్తం చూసి వీరిద్దరికి పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే తీరా పెళ్లి రోజు ముహూర్తం సమయానికి సదరు పాము వరుడు గారు పుట్టలోంచి బయటకు రాలేదు. దీంతో ఒక బొమ్మ పామును తీసుకొచ్చి బిమ్ బాలా పెళ్లి చేశారు. ఈ పెళ్లికి సుమారు 1500మంది దాకా హాజరవడం మరో విశేషం.

అయితే ఈ పెళ్లి ఇప్పటిది కాదని ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగినట్లు తెలుస్తుండగా.. ప్రస్తుతం మరోసారి మీడియాలో హల్ చల్ చేస్తోంది.

English summary
A woman, who claimed to have fallen in love with a snake got married to the reptile as per Hindu rituals at Atala village of Orissa's Khurda district, 14 km from here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X