అసభ్య ఫోటోలు తీసి, కోరిక తీర్చమన్న విద్యార్థి, అరెస్ట్
జైపూర్(ఒడిశా): తనతో సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవాలని ఓ విద్యార్థి డిమాండ్ చేశాడు. దానికి యువతి ససేమీరా అంది. దీంతో, ఆమెను అసభ్యకరరీతిలో తీసిన ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది.
తనతో సంబంధం వద్దని చెప్పినందుకు ఫోటోలు పెడతానని బెదిరించిన అతను ఆమె ఫోటోలు నెట్లో పెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
పన్నెండో తరగతి చదువుతున్న ఓ వ్యక్తి 17 ఏళ్ల బాలిక ఫోటోలను అసభ్యకరరీతిలో తీశాడు. ఆరు నెలల క్రితం ఓ టూరిస్ట్ స్పాట్‌కు వెళ్లినప్పుడు ఆమె ఫోటోలను తీశాడు.

ఆ తర్వాత ఆ ఫోటోలను చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూపించి తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. అతని ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించింది. దీంతో ఫోటోలను నెట్లో పెడతానని బెదిరించి, ఆ తర్వాత అన్నంత పని చేశాడు.
ఈ విషయాన్ని ఆ బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తండ్రి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. నెట్లో అసభ్యకర ఫోటోలు పెట్టారని చెప్పాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం నాడు నిందితుడిని అరెస్టు చేశారు. అతనిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.












Click it and Unblock the Notifications