డీఎస్పీ అనుపమ కేసు, మరో ట్విస్ట్: ఎస్పీ వేధింపులు
బెంగళూరు: కర్నాటకవ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా అంశంలో మరో కొత్త ట్విస్ట్. సీనియర్ల వేధింపులు తాళలేకే తాను రాజీనామా చేశానని ఆమె మంగళవారం నాడు చెప్పారు. ఆమె కర్నాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు.
డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామాలో కొత్త ట్విస్ట్
ఈ మేరకు కమిషన్‌కు ఏడు పేజీల లేఖ గతంలోనే రాశారు. జిల్లా ఎస్పీ చేతన్ తనను మానసికంగా వేధించారని ఆమె అందులో పేర్కొన్నారు. సరిగ్గా తాను రాజీనామా చేసిన జూన్ 4వ తేదీన ఆమె ఈ లేఖను పంపించారు. తన సమీప బంధువులతో ఈ లేఖను పంపించినట్లుగా తెలుస్తోంది.

తన కింద పని చేసేవాళ్లు అసలు సహకరించేవారు కాదని, తన రాజీనామాకు కూడా ఎస్పీయే కారణమని ఆమె చెప్పారు. తాను పందొమ్మిది రోజుల సెలవులో వెళ్లినప్పుడు పోలీసు స్టేషన్లోని రహస్య డాక్యుమెంట్లను ఎస్పీ విడుదల చేశారని, వాటివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానన్నారు.
సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత చిన్న చిన్న కారణాలకే తన పైన పలు మెమోలు జారీ చేశారన్నారు. తాను సెలవు పెడితే ఆ లేఖను ఎస్పీ మెడికల్ బోర్డుకు పంపించారన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు బదులు మహిళా కమిషనే విచారణ జరపాలన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications