Corporation: అంబేద్కర్ పేరు చెప్పుకుని లంచాలు డీల్ చేస్తారా ?, ప్రభుత్వ ఉద్యోగం ?

బెంగళూరు: దళితుల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలకు ప్రభుత్వాలు అందిచే పథకాలు అందేలా అమలు చేసే భాద్యత ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలోనే ప్రభుత్వ పథకాలు అందించడానికి లంచాలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడుతున్న విషయం జగమేరిగిన సత్యం. ఈ విషయం ప్రభుత్వాలకు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

Officer arrested for taking bribe to give loans in Ambedkar Corporation in Bengaluru.

స్వయం సహాయక సంఘాలకు ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఇచ్చిన రుణాల ఫైళ్లను మీద సంతకాలు చెయ్యడానికి ఒక్కొక్క ఫైల్ కు ఇంత డబ్బు ఇవ్వాలని ఓ అధికారి రేట్ ఫిక్స్ చేశాడు. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న అంబేద్కర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తాలూకా అభివృద్ధి అధికారి లంచం తీసుకుంటూ లోకాయుక్త పోలీసుల వలలో చిక్కుకోవడం కలకలం రేపింది.

బెంగళూరు నగరంలోని రాజరాజాజీ నగర్‌లోని అంబేద్కర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో తాలూకా అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్న నారాయణప్ప అరెస్టయ్యాడు. ఓ ఫైల్ మీద సంతకం చెయ్యడానికి నిందితుడు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని బెంగళూరులో లోకాయుక్త పోలీసులు తెలిపారు.

లోకాయుక్త పోలీసుల బృందం సామాజిక కార్యకర్తల వేషంలో వెళ్లి లంచాలు తీసుకుంటున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో రుణం మంజూరు చేయాలని అభ్యర్థించారు. రుణం మంజూరు ఫైళ్ల మీద సంతకాలు చెయ్యాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వెలుగు చూడటంతో పక్కాస్కెచ్ వేసి నిందితులను అరెస్టు చేశామని లోకాయుక్త పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+