కారులో ఇటలీ మహిళపట్ల అసభ్యంగా అధికారి... అరెస్ట్

పోలీసుల కథనం ప్రకారం... ఒక సంస్థలో ఉద్యోగం చేసేందుకు 2011లో ఆమె బెంగళూరు నగరానికి వచ్చారు. ఆమె చేస్తున్న ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడంతో స్వదేశానికి వెళ్లేందుకు వీసా కావాలంటూ ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది పని పూర్తి చేయకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు.
ఈ క్రమంలో ఓ ఉద్యోగి సలహా మేరకు ఆమె యాన్ కృష్ణన్‌ను కలిశారు. మీ ఇంటి వద్ద వదిలి పెడతానని చెప్పి తన కారులోకి ఎక్కించుకున్నాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కారు దిగి వెళ్లిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిని శనివారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications