Officer: ఇంటిలో సజీవదహనం అయిన బ్యాంక్ ఉద్యోగి, హైదరాబాద్ లో భార్య, ఏం జరిగింది ?
బెంగళూరు/ఉడిపి/హైదరాబాద్: బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని భార్య, కుమారుడితో సంతోషంగా జీవిస్తున్నాడు. బ్యాంక్ లో ఉద్యగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్న ఆయన ఇటీవల వేరే రాష్ట్రానికి బదిలి అయ్యాడు. భార్య, కుమారుడు వేరే సిటీలో ఉండటంతో బదిలి అయిన ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని బ్యాంక్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. బ్యాంక్ ఉద్యోగి నివాసం ఉంటున్న ఇంటి నుంచి మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే బ్యాంక్ ఉద్యోగి సజీవదహనం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. బ్యాంక్ ఉద్యోగి ఉంటున్న ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ? ఆనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.

బ్యాంక్ ఉద్యోగి హ్యాపీలైఫ్
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో రాజగోపాల సామగ అలియాస్ రాజగోపాల్ అనే వ్యక్తి లీగల్ సెల్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం వరకు రాజగోపాల్ హైదరాబాద్ లో ఉద్యోగం చేసేవాడు. బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న రాజగోపాల్ అతని భార్య, కుమారుడితో సంతోషంగా జీవిస్తున్నాడు.

హైదరాబాద్ నుంచి ఉడిపి వచ్చిన ఆఫీసర్
ఇంతకాలం హైదరాబాద్ లో ఉద్యోగం చేసిన రాజగోపాల్ ఇటీవల కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని క్రిష్ణమఠం బ్రాచ్ కు బదిలి అయ్యాడు. రాజగోపాల్ భార్య, కుమారుడు హైదరాబాద్ సిటీలో ఉండటంతో బదిలి అయిన ఉడిపి జిల్లాకు చేరుకున్న రాజగోపాల్ ఆ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు.

మంటలు వ్యాపించి సజీవదహనం
రాజగోపాల్ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి టీ స్టాల్ లో టీ తాగి తరువాత ఇంటికి వెళ్లిన విషయం గుర్తించారు. తరువాత బ్యాంక్ ఆఫీసర్ రాజగోపాల్ నివాసం ఉంటున్న ఇంటి నుంచి మంటలు వ్యాపించాయి. విషయం గుర్తించిన స్థానికులు మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే బ్యాంక్ ఆఫీసర్ రాజగోపాల్ సజీవదహనం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
బ్యాంక్ ఉద్యోగి రాజగోపాల్ నివాసం ఉంటున్న ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్లారు ? ఆనే విషయంపై ఉడిపి పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications