సీఎంకు షాక్ ఇచ్చిన మహిళా మంత్రి, ఎక్కడ చూసినా అదే టాపిక్, మేడమ్ కథ !

బెంగళూరు/చిక్కమగళూరు:కర్ణాటకలో ఇప్పుడు పులి గోర్లు, పులి చర్మాల టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు సినిమా కష్టాలు ఎదురైనాయి. శుక్రవారం బెళగావిలోని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ నివాసంలో అటవీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తనయుడు మృణాల్ హెబ్బాళ్కర్ పులి గోర్ల పావ్ లాకెట్ ధరించాడని వెలుగు చూడటంతో అటవి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కుమారుడి ఫోటో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. బెళగావిలోని లక్ష్మీ హెబ్బాల్కర్ నివాసంలో మృణాల్ పులి పంజా లాకెట్‌ను సోదాలు చేసి లాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 Officials raid the home of Karnataka Womens Minister and seize a tiger claw locket

ఇది అసలైన పులి పంజా లాకెట్టు కాదని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు. ఈరోజు అసలు పులి పంజా ఎక్కడ దొరుకుతుంది. అది నకిలీదని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ మీడియాకు చెప్పారు. అధికారుల విచారణకు సహకరిస్తానని, అధికారులు అడిగిన ప్రశ్నలకు పమాధానం చెబుతామని మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ చెప్పారు.

ప్రస్తుతం మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ బెళగావి రూరల్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ఇంటికి చేరుకున్న తర్వాత అధికారులు మరింత సమాచారం సేకరిస్తారని తెలిసింది. లక్ష్మీ హెబ్బాళ్కర్ ఇంటిని తనిఖీ చేయడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపడమే కాకుండా పెద్ద చర్చనీయాంశమైంది.

 Officials raid the home of Karnataka Womens Minister and seize a tiger claw locket

మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కుమారుడి దగ్గర స్వాధీనం చేసుకున్న పులి గోళ్ల లాకెట్ ను బెంగళూరు ఎఫ్‌ఎస్‌ఎల్ కు పంపించి అది అసలైదా, లేదా నకిలినా అని వివరాలు సేకరిస్తున్నామని అటవి శాఖ అధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే మేము దీని గురించి పూర్తి సమాచారం తెలియజేస్తామని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం ప్రాథమిక తనిఖీ నిర్వహించామని, మేము లాకెట్టులో బంగారాన్నివిడదీసి పులి గోళ్లు తీసుకువెళుతున్నామని, అధికారులు తెలిపారు. కర్ణాటక కాఫీనాడు జిల్లాగా పేరు తెచ్చుకున్న చిక్కమగళూరులో పులి గోళ్ల కేసు స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. పులి పంజా డాలర్ ధరించిన ఇద్దరు పూజారులను అటవీశాఖ సిబ్బంది అరెస్ట్ చేశారు. చిక్కమగళూరు తాలూకాలోని ఖాండ్య మార్కండేశ్వర ఆలయ పూజారులు కృష్ణానంద హోళ్ల, నాగేంద్ర జోయ్సాలను అరెస్టు చేశారు.

 Officials raid the home of Karnataka Womens Minister and seize a tiger claw locket

అరెస్టు చేసిన వారి నుంచి మూడు పులి గోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు పూజారులను బాలెహోన్నూరు అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన పూజారులపై బాలెహోన్నూరు అటవీశాఖలో కేసు నమోదు చేశారు. రాజకీయ నాయకులను వదిలేసి పూజర్లను అరెస్టు చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+