అక్కడికి వెళ్ళాలంటే నగ్నంగానే, మహిళలకు ప్రవేశం నిషిద్దం
పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్ళుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాదించడం ఆచారంగా వస్తోంది.
టోక్యో: పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్ళుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాదించడం ఆచారంగా వస్తోంది.
ఈ దీవిలోకి మహిళలకు అనుమతిలేదు. ఆ పవిత్ర ప్రాంతంలోని ప్రవేశించే పురుషులు అక్కడి ఆచారాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకుగాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది.
ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్దఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో ఒకినోషిమా దీని ప్రత్యేకత. పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారు. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని కేవలం పూజారులనే రానిస్తారని చెబుతున్నారు.
అయితే ఆడవారికి అక్కడికి ప్రవేశం నిరాకరించడంపై అధికారులు కూడ తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని భవిస్తారని, శతాబ్దాలనాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదన్నారు.
ఇలాంటి నిషేధాన్ని మహిళలను రక్షించడానినే పెట్టి ఉంటారన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని చైనాను కలిపేచోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు లభించాయి.
అవి ఎటువంటి అవరోధాలు లేకుండా సముద్ర ప్రయాణం సాగినందున ఇక్కడి దేవతను ఆరాధించిన వ్యాపారులు సమర్పించినవి అయి ఉంటాయని ఆలయపూజారి మునకత తైషా తెలిపారు. కాగా, ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్ కమిటీ ఆదివారం తాజగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి.
దీంతోపాటుగా భారత్‌లోని అహ్మదాబాద్ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్టు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్ దీవుల్లోని టవుటపువాటీ అనే పొలినేషియన్ ట్రయాంగిల్ కూడ ఉంది.
అలాగే యూకేలో లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్రికా నుండి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగోవార్ప్ అనేవి కూడ ఉన్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications