యువతితో అసభ్యంగా ఓలా డ్రైవర్, వస్తే ఎంజాయ్ చేద్దాం: అందంగా ఉందని తట్టుకోలేక !
బెంగళూరులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓలా ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు. ఒంటిరిగా ఆటో ఎక్కిన 19 ఏళ్ల విద్యార్థిని పట్ల తిక్కతిక్కగా ప్రవర్తించడంతో ఆటో డ్రైవర్ కటకటాలప
బెంగళూరు: బెంగళూరులో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓలా ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీస్తున్నారు. ఒంటిరిగా ఆటో ఎక్కిన 19 ఏళ్ల విద్యార్థిని పట్ల తిక్కతిక్కగా ప్రవర్తించడంతో ఆటో డ్రైవర్ కటకటాలపాలైనాడు.
బెంగళూరు నగరంలోని ఇందిరానగర్ లో గురువారం 19 ఏళ్ల విద్యార్థిని ఆటో కోసం వేచి చూస్తున్నది. ఆ సందర్బంలో ఓలా ఆటో డ్రైవర్ మంజునాథ్ అటు వైపు వెళ్లాడు. మంజునాథ్ ఆటోలో విద్యార్థిని కుర్చుకునింది. తరువాత మంజునాథ్ ఆటోను ముందుకు నడిపాడు.

యువతి మీద చేతులు వేసి నువ్వు వస్తే !
ఆటోకు ఏర్పాటు చేసిన అద్దంలో యువతిని చూస్తూ మంజునాథ్ వెకిలిచేష్టలు చేశాడు. చాల సేపు విద్యార్థిని ఓపిగ్గా ఉంది. అంతటిలో మంజునాథ్ తన వెకిలిచేష్టలు ఆపకుండా వెనుక కుర్చున్న యువతి మీద చేతులు వేశాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని నువ్వు వస్తే ఇద్దరూ లైంగిక కోరిక తీర్చుకోవచ్చని యువతితో అన్నాడు.

నా ఆటోలో ఎంజాయ్ చేద్దాం రా !
తన ఆటోలోనే నిర్జనప్రదేశంలోకి వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటూ ఆమెను బలవంతం చేశాడు. భయంతో ఆటో దూకిన యువతి గట్టిగా కేకలువేసింది. వెంటనే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విషయం చెప్పింది.

ఆటో డ్రైవర్ పరుగో పరుగు !
పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం గమనించిన ఆటో డ్రైవర్ మంజునాథ్ అక్కడి నుంచి తన వాహనంలో పరారైనాడు. పోలీసులు కంట్రోల్ రూంలో నుంచి బెంగళూరు నగర పోలీసులు అందరికి సమాచారం ఇచ్చారు. ఆటో షెడ్ దగ్గర పార్క్ చేసిన మంజునాథ్ ఇంటిలో తలదాచుకున్నాడు.

ఇంటిలో దాక్కుంటే వదిలేస్తారా ?
ఆటో నెంబర్ ఆదారంగా మంజునాథ్ వివరాలు, అడ్రస్ తెలుసుకున్న పోలీసులు గాలించి చివరికి కామాంధుడిని పట్టుకున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కు బెండ్ తీశారు. బాధితురాలు ఇతర రాష్టానికి చెందిన యువతి అని వెలుగు చూసింది.

అందంగా ఉంది, తట్టుకోలేకపోయా !
యువతి ఒంటరిగా ఉందని, చాల అందంగా ఉండటంతో తట్టుకోలేక మంజునాథ్ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గతంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతులు, మహిళల పట్ల కొందరు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించడంతో కటకటాలపాలైనారు. అయినా బెంగళూరు నగరంలో మాత్రం ఒంటరిగా వెలుతున్న యువతులు, మహిళల పట్ల వేదింపులు మాత్రం ఆగలేదు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications