యువతికి అశ్లీల వీడియో చూపించిన ఓలా క్యాబ్ డ్రైవర్, మానసికంగా, లైంగికంగా!

బెంగళూరు: ఓలా క్యాబ్ లో వెలుతున్న సమయంలో డ్రైవర్ మొబైల్ లో యువతికి అశ్లీల వీడియో చూపించి మానసికంగా, లైంగికంగా హింసించిన సంఘటన బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఓలా క్యాబ్ బుక్ చేసింది

ఓలా క్యాబ్ బుక్ చేసింది

బెంగళూరు నగరంలోని యలహంక న్యూ టౌన్ లో నివాసం ఉంటున్న యువతి జేపీ నగర్ లోని కార్యాలయానికి వెళ్లడానికి ఉదయం 6.30 గంటల సమయంలో ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. ఓలా క్యాబ్ రావడంతో యువతి వాహనంలో కుర్చుంది.

మిర్రర్ లో ముఖం

మిర్రర్ లో ముఖం

క్యాబ్ సిగ్నల్ దాటిన తరువాత డ్రైవర్ మిర్రర్ లో యువతి ముఖం కనపడేలాగా సరి చేశాడు. పదేపదే మిర్రర్ లో యువతిని చూస్తూ ఆమెను ఇబ్బందికి గురి చేశాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత డ్రైవర్ మొబైల్ లో అశ్లీల వీడియో ఆన్ చేశాడు.

వీడియో చూపించాడు

వీడియో చూపించాడు

అశ్లీల వీడియో చూస్తూ డ్రైవర్ వాహనం నడిపాడు. అంతే కాకుండా అశ్లీల వీడియోను యువతికి చూపించి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేశాడు. అతని వేధింపులు తట్టుకోలేని యువతి వాహనం నిలిపివేయాలని చెప్పింది.

కారు నెంబర్

కారు నెంబర్

యువతి వాహనం ఆపమని చెప్పిన చోట కాకుండా దూరంగా వెళ్లి నిలిపాడు. యువతి ఓలా క్యాబ్ బుక్ చేసిన సమయంలో కేఏ-53, సీ-9192 నెంబర్, డ్రైవర్ పేరు దేవసమోలియా అని సమాచారం వచ్చిందని యువతి కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

డ్రైవర్ మాయం

డ్రైవర్ మాయం

ఓలా డ్రైవర్ ను మీది ఏ ఊరు అని ప్రశ్నించిన సమయంలో మధ్యప్రదేశ్ అని సమాచారం ఇచ్చాడని యువతి పోలీసులకు చెప్పింది. యువతి ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఇటీవల కార్పొరేట్ ట్రావెల్స్ కు చెందిన కొందరు డ్రైవర్లు యువతులు, మహిళలను ఇలా వాహనంలో లైంగికంగా వేధింపులకు గురి చేశారని బెంగళూరులో అనేక ఫిర్యాదులు వెలుగు చూశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+