బెల్జియన్ మహిళతో అసభ్యంగా ఓలా డ్రైవర్
న్యూఢిల్లీ: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా, బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గూర్గావ్ ప్రాంతంలో సదరు బెల్జియన్ మహిళ ఢిల్లీకి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరాడు.
అనంతరం ఆమె ముందు కూర్చొని దారి చూపించే క్రమంలో లైంగికంగా వేధించాడు. ఆమె శరీరాన్ని అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. ఆ విధంగా ఆమె వచ్చే మార్గంలో చాలాసేపు లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications