విదేశీ మహిళతో అసభ్యంగా: క్యాబ్ డ్రైవర్ అరెస్టు

జైపూర్: విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్ ను రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. కామంతో కళ్లు మూసుకుపోయి విదేశీ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ చివరికి జైలు పాలైనాడు.

ఫిన్ లాండ్ కు చెందిన యువతి ఉద్యోగరీత్య మూడు నెలలుగా జైపూర్ చేరుకుని నివాసం ఉంటున్నది. ఈమె గత గురువారం రాత్రి పనిమీద బయటకు వెళ్లారు. శుక్రవారం వేకువ జామున 1 గంట సమయంలో ఇంటికి చేరుకోవడానికి సిద్దం అయ్యారు.

 Ola cab Driver Arrested in Rajasthan for Molesting Foreigner

తరువాత ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ గా సుర్యవీర్ పొద్దర్ అనే వ్యక్తి వెళ్లాడు. ఆ విదేశీ మహిళ కారులో కూర్చున్నారు. తరువాత సూర్యవీర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను గట్టిగా పట్టుకుని ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా ప్రవర్తించాడు.

బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యవీర్ ను అరెస్టు చేసి, అతని కారును స్వాధీనం చేసుకుని ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని శనివారం డీసీపీ కైలాష్ చంద్ తెలిపారు. ఈ మద్య కాలంలో ఒంటరిగా వెళుతున్న మహిళల పట్ల క్యాబ్ డ్రైవర్ లు అసభ్యంగా ప్రవర్థిస్తున్న సంఘనలు ఎక్కువ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+