ఏం పోయేకాలం: అర్దరాత్రి మహిళను నడిరోడ్డులో వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్!
బెంగళూరు: మహిళను అర్దరాత్రి నడిరోడ్డులో ఓలా క్యాబ్ డ్రైవర్ వదిలి వెళ్లిపోయిన ఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. వీది దీపాలు లేని చీకటిలో, జనసంచారం లేని చోట మహిళా ఉద్యోగిని వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ ఇప్పుడు నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

కొలంబో టూ బెంగళూరు
శ్రీలంకలోని కొలంబో నుంచి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన మహిళా సీనియర్ మేనేజర్ అర్దరాత్రి సమయంలో బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. విమానం దిగిన 10 నిమిషాలకే ఆమె ఇంటికి వెళ్లడానికి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది.

హైవేలో కాకుండా పక్కదారి !
కారులో ఎక్కిన 10 నిమిషాల తరువాత ఓలా క్యాబ్ డ్రైవర్ ఎన్ హెచ్-14లో కాకుండా బేగూరు రోడ్డులో కారు నడిపాడు. కారులో కుర్చుకున్న మహిళకు అనుమానం వచ్చింది. బెంగళూరు-బళ్లారి హైవేలో వెళ్లకుండా ఈ దారిలో ఎందుకు వెలుతున్నావు ? అంటూ ఓలా క్యాబ్ డ్రైవర్ ను ప్రశ్నించింది.

గూగుల్ మ్యాప్ దారి ఇదే !
మీరు చెప్పిన అడ్రస్ కు గూగుల్ మ్యాప్ ప్రకారం వెలుతున్నానని, నువ్వు సైలెంట్ గా కారులో కుర్చోవాలని ఓలా క్యాబ్ డ్రైవర్ ఘాటుగా ఆమెకు సమాధానం ఇచ్చాడు. తాను వెళ్లే దారి ఇది కాదని ఆమె ఎంత చెప్పినా ఓలా క్యాబ్ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా బేగూరు రోడ్డులోనే వెళ్లాడు.

ఎమెర్జెన్సీ బటన్ నొక్కితే!
మహిళకు అనుమానం వచ్చి వెంటనే ఓలా ఎమర్జెన్సీ బటన్ ప్రెస్ చేసింది. వెంటనే ఓలా డ్రైవర్ కారును నడిరోడ్డులో నిలిపేశాడు. వెంటనే కారు దిగిపోవాలని, తాను ఇక్కడి నుంచి ఒక్క అడుగు దూరం కూడా నిన్ను పిలుచుని వెళ్లనని తేల్చి చెప్పాడు.

చీకట్లో వదిలేశాడు
వేకువ జామున 3.15 గంటల సమయంలో వీది దీపాలు, జన సంచారం లేని ప్రాంతంలో ఆమెను వదిలేసిన ఓలా క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తాను ప్రయాణించిన విమానంలోనే ప్రయాణించిన స్నేహితుడికి ఆమె ఫోన్ చేసి తనను పిలుచుకుని వెళ్లాలని ఆమె ఫోన్ చేసి చెప్పింది. స్నేహితుడు కారు తీసుకని వచ్చిన తరువాత ఆ మహిళ సాఫ్ట్ వేర్ కంపెనీ సీనియర్ మేనేజర్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

మోడల్ దారుణ హత్య
ఓలా ఎమెర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేస్తే వారు కాల్ హోల్డ్ చేశారని, అర్దరాత్రి ఇలా స్పందిస్తే ఎలా అంటూ ఆమె విచారం వ్యక్తం చేసింది. ఇటీవల కోల్ కతాకు చెందిన ఓ మోడల్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఎయిర్ పోర్టుకు వెలుతున్న సమయంలో బేగూరు సమీపంలోనే వేకువ జామున క్యాబ్ డ్రైవర్ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications