నడి రోడ్డులో యువతిని బూతులు తిట్టిన ఓలా క్యాబ్ డ్రైవర్: చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించి!

బెంగళూరు: నడిరోడ్డులో యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చెప్పుతో కొట్టడానికి ఓలా క్యాబ్ డ్రైవర్ ప్రయత్నించిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఓలా క్యాబ్ డ్రైవర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

మెజస్టిక్ సమీపంలోని మైసూరు బ్యాంక్ సర్కిల్ నుంచి మల్లేశ్వరంలోని ఇంటికి వెళ్లడానికి ఓ యువతి ఆమె తల్లితో కలిసి వేచి ఉంది. ఇంటికి వెళ్లడానికి యువతి ఓలా క్యాబ్ బుక్ చేసింది. రోడ్డు మీదకు వచ్చిన యువతి ఓలా క్యాబ్ డ్రైవర్ మహదేవస్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసింది.

Ola driver allegedly attempted to beat a woman passenger near SBM circle in Bengaluru

సమీపంలోని సిగ్నల్ లో తాను ఉన్నానని, త్వరగా వచ్చేస్తానని ఓలా క్యాబ్ డ్రైవర్ మహదేవస్వామి యువతికి సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే మహదేవస్వామి క్యాబ్ లో వెయిటింగ్ చార్జ్ మీటర్ ఆన్ చేసి పెట్టాడు. యువతి ఉన్న చోటకు ఓలా క్యాబ్ వచ్చింది.

యువతి మీటరు చూసి ఎందుకు అప్పుడే వెయిటింగ్ చార్జ్ మీటర్ ఆన్ చేశావు అని డ్రైవర్ మహదేవస్వామిని ప్రశ్నించారు. ఆ సమయంలో డ్రైవర్ మహదేవస్వామి నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే యువతిని బూతులు తిట్టాడు.

Recommended Video

    Bangalore Ola Cab Incident : కారు డోర్‌ను లాక్‌ చేసి ఇలా ?

    తన తల్లి, ప్రజల ముందే తనను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించాడని, క్యాబ్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తున్నానని అసభ్యంగా దూషించి వెళ్లి పోయాడని భాదితురాలు ఉప్పరపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఓలా క్యాబ్ డ్రైవర్ మహదేవస్వామిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+