ఓలా బంపర్ ఆఫర్: 30 నిమిషాల్లో లోన్
చెన్నై: ఓలా క్యాబ్ కంపెనీ తన సంస్థలో పని చేసే డ్రైవర్లకు, వ్యాపార భాగస్వాములకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం 30 నిమిషాల్లో వారి అవసరాలకు తగినట్లుగా లోన్ ఇచ్చే వేదికను ఏర్పాటు చేసింది.
అందు కోసం ఫ్లెక్సీ లోన్స్ టెక్నాలజీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ సిబ్బంది అడిగిన ప్రాథమిక దస్తావేజులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. తరువాత 30 నిమిషాల్లో వారికి అవసరమైన నగదు (లోన్) అందుతుంది.

రూ. ఒక లక్ష వరకు ఓలా క్యాబ్ డ్రైవర్లకు, బిజినెస్ పార్టనర్స్ కు లోన్లు ఇచ్చేందుకు ఫ్లెక్సీ లోన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఆన్ లైన్ ద్వారానే ఇది జరుగుతుంది. తరువాత నెల నెలా (కంతులు) లోన్ తీసుకున్న రుణం తిరిగి చెల్లించే సౌకర్యాన్ని కల్పించారు.
ఈ వివరాలను ఓలా కంపెనీ వెల్లడించింది. డ్రైవర్లు, బిజినెస్ పార్టనర్స్ ఇబ్బందులు తొలగించే క్రమంలో భాగంగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ఓలా సంస్థ తెలిపింది. మొదట ముంబై, బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఫలితాల అనంతరం దేశ వ్యాప్తంగా విస్తరించనున్నామని ఓలా సంస్థ తెలిపింది.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications