జొమాటో 520, స్విగ్గీ 1100, ఇప్పుడు ఓలా వంతు.. 1400 మంది సిబ్బందిని తొలగించిన కంపెనీ

లాక్ డౌన్ వల్ల కంపెనీల పరిస్థితి దయనీయంగా మారింది. పని లేక, ఆదాయం రాకపోవడంతో ఖర్చులను తగ్గించుకునేపడిలో పడ్డాయి. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో 520 మంది ఉద్యోగులను తొలగించడంతో ప్రక్రియ ప్రారంభమైంది. జొమాటో తర్వాత స్విగ్గీ కూడా ఇదే బాటలో కొనసాగింది. ఇటీవలే 1100 మందిని విధులనుంచి తప్పించింది. తర్వాత ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా వంతువచ్చింది.

సంస్థకు చెందిన 1400 సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్‌కు చెందిన సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. దీనిని ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. లాక్ డౌన్ వల్ల ఓలా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన అంగీకరించారు.

Ola to lay off 1,400 employees as revenue dips 95% in two months

సంస్థ ఆదాయం భారీగా పడిపోయిందని వివరించారు. రికవరీ అయ్యేందుకు చాలారోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వివరించారు. మార్చి 22వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా క్యాబ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఓలా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఓలా రైడ్స్ కంపెనీపై చూపిన ప్రభావం.. ఇతర వ్యాపారాలపై ప్రభావం చూపించిందని.. అందుకే ఉద్యోగుల తొలగింపు తప్పలేదని పేర్కొన్నారు.

ఓలా కంపెనీ రెవెన్యూ రెండు నెలల్లో 95 శాతం పడిపోయింది. దీంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదు అని భవష్ అగర్వాల్ తెలిపారు. ఇది కంపెనీలో 25 శాతం కార్మికులతో సమానమని.. భవిష్ అగర్వాల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+