నేడు ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్ల సమ్మె: ప్రయాణికులకు అలర్ట్!
దేశవ్యాప్తంగా ఉన్న యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ డ్రైవర్లు శనివారం(ఫిబ్రవరి 7) నాడు 6 గంటల పాటు సమ్మె(Ola Uber Rapido Strike Today)కు పిలుపునిచ్చారు. 'ఆలిండియా బ్రేక్‌డౌన్' పేరుతో జరుగుతున్న ఈ నిరసన కారణంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు కలిగే అవకాశం ఉంది.
సమ్మెకు ప్రధాన కారణం
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU), ఇతర జాతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. యాప్ కంపెనీలు ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయించడం, డ్రైవర్లను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవర్ల 2 ప్రధాన డిమాండ్లు:
'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025' ప్రకారం, ప్రభుత్వం వెంటనే కనీస బేస్ ఛార్జీలను నోటిఫై చేయాలి. యాప్ కంపెనీలు తమ ఇష్టానుసారంగా ఛార్జీలు తగ్గించకుండా, డ్రైవర్ల యూనియన్లతో చర్చించి ధరలను ఖరారు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వైట్ బోర్డు (ప్రైవేట్) వాహనాలను కమర్షియల్ ప్రయాణాలకు లేదా వస్తువుల రవాణాకు వినియోగించడాన్ని కఠినంగా నిషేధించాలి. దీనివల్ల కమర్షియల్ లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులపై ప్రభావం:
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (సుమారు 6 గంటలు) డ్రైవర్లు యాప్‌ల నుంచి లాగ్ అవుట్ అవుతారు. ఓలా (Ola), ఉబర్ (Uber), రాపిడో (Rapido), పోర్టర్ (Porter) వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. విమానాశ్రయాలకు లేదా అత్యవసర పనులకు వెళ్లే వారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను (మెట్రో, ఆర్టీసీ బస్సులు) చూసుకోవడం ఉత్తమం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications