60 ఏళ్లు సంసారం, భర్త మరణించాడని జీర్ణించుకోలేకపోయిన భార్య, కలిసే వెళ్లిపోవాలని !

ప్రతి ఒక్క స్త్రీ తాను సుమంగళిగానే చనిపోవాలని కోరుకుంటారు. భర్త లేని జీవితం జీర్ణించుకోలేని భార్య ఆయన కంటే ముందుగానే తాను చనిపోవాలని కోరుకుంటుంటారు. భర్త చనిపోయిన కొన్ని గంటల్లోనే భార్య మరణించిన ఘటన

బెంగళూరు: ప్రతి ఒక్క స్త్రీ తాను సుమంగళిగానే చనిపోవాలని కోరుకుంటారు. భర్త లేని జీవితం జీర్ణించుకోలేని భార్య ఆయన కంటే ముందుగానే తాను చనిపోవాలని కోరుకుంటుంటారు. భర్త చనిపోయిన కొన్ని గంటల్లోనే భార్య మరణించిన ఘటన కర్ణాటకలో జరిగింది.

60 ఏళ్లు కలసి బతికిన భర్త చనిపోవడంతో ఆమె ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని ధారవాడ సమీపంలోని కరడిగుడ్డ ప్రాంతంలో యల్లప్ప (80), భీమవ్వ (75) వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు 60 ఏళ్లు కలిసికాపురం చేసి ఒకరిని విడచి ఒకరు ఉండలేనంతగా బతికారు.

Old Couples Together died in dharwada in Karnataka

అనారోగ్యంతో బుధవారం సాయంత్రం యల్లప్ప మరణించారు. గురువారం యల్లప్ప అంత్యక్రియలు చెయ్యడానికి గ్రామస్తులు అన్ని సిద్దం చేస్తున్నారు. భీమవ్వ భర్తలేని జీవితం ఊహించలేకపోయింది. గురువారం భర్త అంత్యక్రియలకు సిద్దం చేస్తున్న విషయం చూసిన భీమవ్వ తట్టుకోలేకపోయారు.

భీమవ్వకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో భర్త శవం పక్కనే కుప్పకూలి మరణించారు. దంపతులు ఇద్దరు కొన్ని గంటల వ్యవదిలోనే మరణించడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. దంపతులకు ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించాలని గ్రామ పెద్దం నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+