భార్య తనను విడిచి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం.. అదజాన్‌లో నివాసం ఉంటున్న బాధితుడు బబ్లూ షాకి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏదో చిన్న గొడవ కారణంగా మూడు నెలల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే తన భార్యను ఎంత బతిమాలినా కూడా ఆమె తిరిగి తన ఇంటికి వచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
అంతేగాక పిల్లల్లో ఒకర్ని భార్య తన వెంట తీసుకుపోగా మరో చిన్నారి షా వద్దే ఉంటోంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి బబ్లూ షా తన ఉద్యోగ విధులకు దీర్ఘకాల సెలవు పెట్టాడు. అతని ఆందోళనలకు భార్య వెళ్లిపోవడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా కారణమేనని అతని పొరిగింటివారు చెబుతున్నారు.
కాగా సోమవారం రోజు తన విధులకు హాజరైన షా, అతడు పనిచేస్తున్న భవనం 9వ అంతస్తుపై నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కిడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాధితుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications