ఆర్మీపై ఓంపురి సంచలనం, కేసు: 'సర్జికల్‌పై కేజ్రీవాల్‌లోనే లోపం'

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ఓంపురి పైన మంగళవారం నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. భారత ఆర్మీని కించపరిచేలా ఆయన వ్యాఖ్యానించారని ఓ వ్యక్తి ముంబైలోని అంధేరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అశోక్‌ దూబే మాట్లాడారు. ఓంపురిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడని, దీనిపై ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారన్నారు. విచారణను బట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఓంపురి తీవ్ర వ్యాఖ్యలు

ఓంపురి తీవ్ర వ్యాఖ్యలు

ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో ఓంపురి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చనిపోయిన యూరి ఉగ్రదాడిలో చనిపోయిన సైనికుల గురించి మాట్లాడారు. వారిని సైన్యంలో చేరమని ఎవరైనా బలవంతం చేశారా? ఆర్మీలో చేరి ఆయుధాలు పట్టుకోమని ఎవరు చెప్పారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓంపురి పైన అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు పోలీసులను కోరారు.

కేజ్రీవాల్ పైన ట్విట్టర్లో ఆగ్రహం

కేజ్రీవాల్ పైన ట్విట్టర్లో ఆగ్రహం

సరిహద్దులో భారతసైన్యంతో సర్జికల్ స్ట్రయిక్ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రెండు రోజుల కిందట ఓ వీడియో విడుదల చేశారు. ఎప్పుడూ కేంద్రాన్ని, ప్రధాని మోడీని విమర్శించే కేజ్రీవాల్‌ ఆయనను, సైనికుల చర్యను అభినందిస్తూ మోడీకి సెల్యూట్‌ చేశారు.

కేజ్రీవాల్ వివాదం

కేజ్రీవాల్ వివాదం

ఆ తర్వాత చివరలో మాట్లాడిన ఆయన మాటలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరగలేదని, నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు జరిపారని పాకిస్తాన్ ఆరోపించిన విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ మీడియా పాక్‌ వ్యాఖ్యలకు మద్దతిస్తూ ఈ విషయంలో కథనాలు సైతం ప్రచురించారన్నారు. నిజం నిర్ధారణ కావాలంటే అందుకు సంబంధించిన ఆధారాలు వెల్లడించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ట్విట్టర్‌లో కేజ్రీవాల్‌పై పలువురు విమర్శల వర్షం కురిపించారు.

సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్

హడావిడిగా టీవీల్లో ప్రసారం చేయడానికి సర్జికల్ స్ట్రయిక్.. స్టింగ్‌ ఆపరేషన్‌, సెక్స్‌రాకెట్‌ టేప్‌ కాదని, సొంత సైన్యాన్ని నమ్మకపోతే లోపం మీలోనే ఉన్నట్లు అని ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ విమర్శించారు. కేజ్రీ ఈ వీడియో ద్వారా మరో గేమ్ ఆడుతున్నారని, ఆధారాలు కావాలంటే ఓ 15లక్షల సీసీ కెమెరాలు అమర్చుకోమని ఇలా పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు.

5

రాధికా ఆప్టే

రాధికా ఆప్టే

పాకిస్తాన్ నటుల పైన నిషేధం సరికాదనే వారి జాబితాలో రాధికా ఆప్టే కూడా చేరింది. పాక్ నటుల పైన నిషేధం విధించడం సరికాదని ఆమె చెప్పింది. స్విట్జర్లాంటులో తయారైన ఓ వాచ్.. భారత దేశంలో వారి సొంత షాపుల్లోనే అమ్ముతున్నప్పుడు పాక్ నటులు ఇక్కడ నటించడం తప్పులేదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+