వెర్రివాళ్లమా: సోనియా, రాహుల్‌పై ఓంపురి, ‘మోడీ తప్ప’(వీడియో)
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓంపురి ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది.
'రాహుల్‌ని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే ప్రధానిగా అతనికి ఓటేయడానికి భారతీయులు వెర్రివాళ్లా.. రాహుల్ అధ్యక్షుడైతే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు భారతీయ జనతా పార్టీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు' అని ఓంపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'మనకు మోడీ తప్ప ఇంక మరో దిక్కు లేదు. సోనియా తన కుమారుడిని ప్రధాని పీఠం ఎక్కించాలనుకుంటోంది. రాహుల్ వయసెంత.. అతని అనుభవం ఎంత. అసలు అతను ఏం మాట్లాడుతుంటాడో చూడండి.. అతడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి మనమేమన్నా వెర్రివాళ్లలాగా కన్పిస్తున్నామా?' అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో ఆయనను తోలుబొమ్మలా ఆడించారని సోనియాపై ఘాటైన ఆరోపణలు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఇటీవల వరుస ఓటములతో ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించాల్సిన సమయం వచ్చిందని, కొత్త తరానికి బాధ్యతలు ఇవ్వాలని సోనియా గాంధీభావిస్తున్నట్లు కొందరు పార్టీ సీనియర్ నేతలు అంటుంటే సోనియానే కొనసాగాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 2013లో రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications