షాకింగ్: ఆటో డ్రైవర్‌పై ఇద్దరు అమ్మాయిల రేప్‌యత్నం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మహిళల పైన లైంగిక వేధింపుల ఫిర్యాదులను, కేసులను మనం వింటుంటాం. కానీ, ఇద్దరు అమ్మాయిలు ఓ ఆటో డ్రైవర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడటం గమనార్హం.
ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ప్రాంతంలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఆ ఆటో డ్రైవర్ పైన లైంగిక వేధింపులకు ప్రయత్నించారు.

అతను వారి నుండి తప్పించుకునేందుకు ఓ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ కిటికీ నుండి కిందకు దూకేశాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఇద్దరు అమ్మాయిల పైన కూడా లైంగిక వేధింపుల కింద ఫిర్యాదు అందింది.
ఆటో డ్రైవర్ తనను తాను రక్షించుకునేందుకు మొదటి అంతస్తులోని కిటికీ నుండి కిందకు దూకడంతో అతని కాళ్లకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications