Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Omicron:15వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ ప్లైట్స్ పునరుద్దరణ లేనట్టే..? కారణమిదేనా..?

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. వైరస్ వెలుగులోకి వచ్చిన సౌతాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను చాలా దేశాలు నిషేధించాయి. ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో దానిపై పునరాలోచన చేసింది. కమర్షియల్ ప్లైట్స్ అనుమతించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. వాటిపై నిషేధం యథావిధిగా కొనసాగుతోందని తెలుస్తోంది.

అలర్ట్.. అలర్ట్...

అలర్ట్.. అలర్ట్...

దేశంలో ఎయిర్ పోర్టులు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను నిశీతంగా పరిశీలిస్తున్నారు. వైరస్ కేసులు ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు చేస్తున్నారు. అవసరం అయితే క్వారంటైన్ చేస్తున్నారు. ఎయిర్ బబుల్ సిస్టమ్ కంపల్సరీగా ఆలో చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నామని.. అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసెంజర్ సర్వీసుపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదని.. డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.

దేశీయ విమానాలు ఫుల్

దేశీయ విమానాలు ఫుల్


డెల్టా వేరియంట్ కన్నా కూడా ఒమిక్రాన్ ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రస్తుతం దేశంలో కార్యాలయాలు తెరిచారు. మాల్స్, సినిమా హాళ్లు నడుస్తున్నాయి. స్కూళ్లు నడుస్తోన్న.. ఆఫ్ లైన్ విధానంలో ఎక్కువగా వింటున్నారు. దేశీయ విమానాలు పూర్తి కెపాసిటీతో నడుస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ విమానాలు కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దీంతో గతనెల 26వ తేదీన.. డిసెంబర్ 15వ తేదీ నుంచి అన్నీ ప్లైట్ సర్వీసులను నడిపిస్తామని పేర్కొంది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి వెనక్కి తగ్గినట్టే అనిపిస్తోంది.

20 నెలలు బ్యాన్..?

20 నెలలు బ్యాన్..?


ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్లైట్ మరో 20 నెలలు నిలిపివేయాలని భావిస్తోంది. ప్యాసెంజర్ విమానాలు మాత్రం ఎయిర్ బబుల్ విధానం అమలు చేసి అనుమతించాలని భావిస్తోంది. పరిమిత నిబంధనలతో.. రెండు, మూడు దేశాలకు నడిపించాలని అనుకుంటోంది. విదేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా పరీక్షలు చేస్తున్నారు. వారికి నెగిటివ్ వస్తేనే పంపిస్తారు. లేకపోతే క్వారంటైన్ తప్పదు. నెగిటివ్ వచ్చినా.. ఇంటిలో వారం క్వారంటైన్ తప్పదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాలను అమలు చేస్తున్నాయి.

ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ

ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ


విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు జరపాలని కేంద్రం తెలిపింది. 'ఎట్‌ రిస్క్‌' జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఫలితాలు వచ్చే వరకూ ఎయిర్‌పోర్టులోనే ఉండాలని నిబంధన పెట్టింది. పాజిటివ్‌గా తేలినవారికి 14 రోజులు క్వారంటైన్‌, జన్యుక్రమ విశ్లేషణ కోసం వారి నమూనాలను ఇన్సాకాగ్‌కు పంపించాలని తెలిపింది. ప్యాసింజర్ల ట్రావెల్‌ హిస్టరీ సేకరించాలని సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+