మహమ్మారి ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. బి అలర్ట్
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను కలవర పెడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని అలర్ట్ చేసింది. మరోవైపు ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో డెల్టా వైరస్ వేరియంట్ కంటే భిన్నమైన లక్షణాలు కన్పిస్తున్నాయని దక్షిణాప్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్టి వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి రాత్రిపూట విపరీతమైన చెమలు, పొడి దగ్డు, ఒళ్లునొప్పులు , తేలికపాటి జర్వం వంటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు.

తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పి..
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన వారిలో సాధారణ కొవిడ్ లక్షణాలైన గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, తరచూ ముక్కు కారం వంటివి కనిపించడంలేదు. ఒమిక్రాన్ సోకిన వారికి వీపరీతమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తేలికపాటి జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్టర్ పేర్కొన్నారు. రెండు డోసుల టీకా తీసుకోని వారిలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి భరించలేనంతగా ఉంటున్నాయని తెలిపారు. అయితే కొందరికి మాత్రం డెల్టాకంటే భిన్నంగా ఉన్న కొన్ని అసాధారణ లక్షణాలు కన్పిస్తున్నారని అన్నారు.

రాత్రి పూట విపరీతమైన చెమటలు
ముఖ్యంగా ఒమిక్రాన్ సోకిన వారికి రాత్రి పూట విపరీతమైన చెమటలు పడుతున్నాయి. ఈ చెమట కారణంగా వారి దుస్తులు, బెడ్ కూడా తడిసిపోతున్నాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. ఎక్కువ మందిలో ఈ లక్షణం ప్రధానంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇంతకు ముందుకు కరోనా డెల్టా వైరస్ సోకిన వారికి రుచి వాసన కూడా తెలిసేది కాదు. కానీ ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ఈ లక్షణం కన్పించడం లేదని వెద్యులు తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ బారిన పడ్డ వ్యక్తుల్లో గొంతు నొప్పి లేదా వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు.
Recommended Video

రోగుల లక్షణాలను బట్టి నిర్ధారణ
దక్షిణాప్రికాలో తొలుత ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది. ఈ వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఏంజెలిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రోగుల లక్షణాలను బట్టి ఒక నిర్ధారణకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరు కొత్త వైరస్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ లక్షణాలు శరీరంలో కనిపినిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచనలు చేశారు . అటు ఆమెరికాలోనూ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అసాధారణ రీతిలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 77 దేశాలకుపై వైరస్ వ్యాప్తి చెందడంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications