మహిళా డ్యాన్సర్‌తో ఆర్‌జెడి లీడర్ అరుణ్ దాదుపురి చిందులు, వైరల్
పాట్నా: ఆర్‌జెడి నాయకుడు ఓ మహిళా డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్‌జెడి నేత అరుణ్ దాదుపరి ఓ పెళ్ళి వేడుకలో బార్ డ్యాన్సర్‌తో చిందులేశాడు. అంతేకాదు ఆమెపై డబ్బుల వర్షం కురిపించాడు అయితే ఆ సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

మార్చి 10న బీహర్ రాష్ట్రంలోని బీహర్ గోపాల్ గంజ్ జిల్లాలోని ఫతేపూర్ లో ఓ వివాహ వేడుకలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఆ డ్యాన్సర్‌ను ఎత్తుకొని ఆర్జేడీ నాయకుడు చిందులేశాడు. ఆమెపై డబ్బులపై కురిపించాడు.
అరుణ్ దాదుపురి ఆర్‌జెడి పర్యవేక్షణ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఫతేపూర్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్‌గా కూడ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. ఈ వీడియోతో ఆ పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు.












Click it and Unblock the Notifications