గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు: సుప్రీంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నోటా వినియోగం అంశంలో కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నోటాపై స్టే విధించాలని కాంగ్రెస్ కోరింది.
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో నోటా వినియోగం అంశంలో కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. నోటాపై స్టే విధించాలని కాంగ్రెస్ కోరింది.
కానీ సుప్రీం కోర్టు స్టే విధించడానికి గురువారం నిరాకరించింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు నోటా గుర్తుతోనే జరుగుతాయని సుప్రీం కోర్టు చెప్పింది.

గుజరాత్లో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో నోటా ఐచ్ఛికాన్ని చేర్చాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనిపై కాంగ్రెస్ బుధవారం సుప్రీంలో సవాల్ చేసింది.
ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కోరడంతో జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దానిపై విచారణ జరిపేందుకు అంగీకరించింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడమే కాక నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని కూడా గుజరాత్ కాంగ్రెస్ తన పిటిషన్లో కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురయింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications