అక్రమ సంబంధం లీక్, ఫ్రెండ్స్ తో కలిసి సోదరి మీద గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన సోదరుడు !
దేశంలో రోజు రోజుకు అత్యాచారం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఓ వ్యక్తి అతని నలుగురు స్నేహితులతో కలిసి సొంత సోదరిపై సామూహిక అత్యాచారం చేశాడ.
తన స్నేహితులతో కలిసి సోదరిపై సామూహిక అత్యాచారం చేసిన వ్యక్తి ఆతర్వాత ఆమెను దారుణ:గా హత్య చేసినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు.
ఈ సంఘటన నవంబర్ వ3వ తేదీన చక్‌పాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, అయితే సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఎవరు అనే విషయం నెల రోజుల తరువాత తెలిసింది. నెల రోజుల పాటు యువతి దారణ హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోయిందని, చివరికి అసలు మ్యాటర్ తెలిసి అందరూ షాక్ అయ్యామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈకేసులో హంతకులు ఎవరనేది అని నెల రోజులు మిస్టరీగానే ఉంది.

పోలీసులు కేసును ఛేదించడంతో అసలు హంతకుడు, అతని స్నేహితులను అరెస్టు చేశామని సోమవారం పోలీసులు తెలిపారు. హత్యకు గురైన 25 ఏళ్ల యువతికి ఓ అన్న ఉన్నాడు. తన అన్న వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ యువతికి తెలిసింది. వదనితో అక్రమ సంబంధం వదులుకోవాలని, లేని పక్షంలో ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు ఇతరులకు చెబుతానని ఆ యువతి అతని అన్నను బెదిరించింది.
ఈ నేపథ్యంలో తన అక్రమ సంబంధం గురించి బయటకు రాకుండా ఉండాలంటే తన సోదరిని ఏదైనా చెయ్యాలని ఆమె అన్న బావించాడు. ఈ సంఘటన జరిగిన రోజు ఆ యువతి సాలి ఆకులను సేకరించేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. ఆమె అన్నయ్య కూడా తన ఆవులతో అదే అడవిలోకి వెళ్లాడు. తన సోదరి ఒంటరిగా అడవికి వచ్చిందని ఆమె అన్న గుర్తించాడని పోలీసులు తెలిపారు.
అనంతరం యువతి అన్న అతని స్నేహితులైన నలుగురికి ఫోన్లు చేసి అడవికి పిలిపించి అక్కడే మద్యం సేవించారని పోలీసులు అన్నారు. మద్యం మత్తులో ఉన్న అన్న అతని స్నేహితులతో కలిసి సోదరి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ కేసు విషయంలో చాకపాడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లలిత్ మోహన్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ యువతి అత్యాచారం నుంచి తప్పించుకోవడానికి పోరాడుతుండగా ఆమె గొంతు కోసి ఆపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించిందని అన్నారు.

యువతి సోదరుడు నవంబర్ 6వ తేదీన స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తన సోదరి కనపడంలేదని మిస్సింగ్ కేసు పెట్టాడని పోలీసులు తెలిపారు. నవంబరు 7వ తేదీన అడవిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. యువతిపై పలువురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. అయితే గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల పేర్లు ఇప్పుడే బయటకు చెప్పలేమని, కేసు విచారణ పూర్తి అయిన తరువాత పూర్తి సమాచారం చెబుతాామని పోలీసు అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications