Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

786 సింబల్, ఒక గొర్రె విలువ రూ. 1 కోటి రూపాయలు, బక్రీద్ ఎఫెక్ట్ తో యజమాని !

జైపూర్/ రాజస్థాన్: ఒక గొర్రె అబ్బా అంటే ఎంత ధర పలుకుతుంది చెప్పండి. మంచి జాతి గొర్రె అయితే రెండు మూడు లక్షల రూపాయల ధర పలుకుతుంది. అయితే ఏడాది వయసున్న గొర్రె ఒక కోటి రూపాయల ధర అని ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, రాజస్థాన్ లో కోటి రూపాయల ఆఫర్ వచ్చింది. రూ. 1 కోటికి కూడా ఆగొర్రెను నేను అమ్మను అని దాని యజమాని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఉన్న ఈ గొర్రె ఇప్పుడు బంగారం కంటే ఎక్కువ ధర పలకండం హాట్ టాపిక్ అయ్యింది. అది ప్రత్యేక జాతి గొర్రెల కోసం కాదు, గొర్రెలపై ఉన్న నంబర్ కోసం కోటి రూపాయల ఆఫర్ వచ్చింది. అవును, గొర్రెలపై 786 సంఖ్య ఉంది, ఉర్దూ భాషలో ఈ సంఖ్య గుర్తు గొర్రెలు బంగారం ధరను పొందటానికి కారణం.

 On the occasion of Bakrid festival, one sheep is sold for Rs. 1 crore rupees in Rajasthan.

భారతదేశంలోని ముస్లింలు 786 సంఖ్యను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. గొర్రెలపై ఈ సంఖ్య ఉండడంతో కోట్లాది రూపాయలు పలుకుతున్నా కొనుగోలు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. రాజు సింగ్ అనే గొర్రెల కాపరికి అతని గెర్రె మీద ఉన్న ఆ సంఖ్య అర్థం అర్థం కాలేదు. కానీ తన గ్రామంలోని ముస్లిం సమాజ సభ్యులతో మాట్లాడిన తర్వాత రాజు సింగ్ కు అసలు మ్యాటర్ తెలిసింది.

తన గెర్రె మీద ఉన్న 786 అనే సంఖ్య ఉర్దూ సంఖ్య అని తెలుసుకున్నాడు. ఈ సంఖ్య ఇస్లాంలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తరచుగా దేవుని ఆశీర్వాదాలను కోరే మార్గంగా ఈ 786 సంఖ్య ఉపయోగించబడుతుందని, ముస్లీంలు ఈ సంఖ్యను దేవుడితో సమానంగా బావిస్తారని గొర్రెల యజమాని రాజు సింగ్ కు తెలిసింది.

ఈ గొర్రెపిల్ల గతేడాది పుట్టగా ఇప్పటి వరకు చాలా మంది ఈ గొర్రెను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు మొదట ఓ వ్యక్తి రూ.. 70 లక్షల రూపాయలకు ఆ గెర్రెను కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నించడంతో దానిని అమ్మడానికి రాజు సింగ్ నిరాకరించాడు. తరువాత బక్రీద్ పండుగ సందర్బంగా మరో ముస్లీ సమాజానికి చెందిన వ్యక్తి రూ. ఒక కోటి రూపాయల వరకు ఆఫర్ చేశారు. కానీ రాజు సింగ్ మాత్రమే ఈ ఆఫర్లను తిరస్కరించాడు. ఈ గొర్రె నాకు ఎంతో ప్రీతికరమైనదని, ఎంత చెల్లించినా అమ్మబోనని రాజు సింగ్ తేల్చి చెప్పాడు.

 On the occasion of Bakrid festival, one sheep is sold for Rs. 1 crore rupees in Rajasthan.

గొర్రె పిల్ల ఖరీదు కోట్లాది రూపాయలు అవుతుందని అంచనా వేసినందున ఇప్పుడు ఆ గెర్రెను దాని యజమాని రాజు సింగ్ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఆ గొర్రెకు ఇప్పుడు దానిమ్మ, బొప్పాయి, మినుములు, పచ్చి కూరగాయలతో కూడిన ప్రత్యేక ఆహారంగా అందిస్తున్నారు. అన్ని గొర్రెల మందలోకి ఆ గెర్రెను వదలకుండా రాజు సింగ్ దానిని ఇంటి నుంచి బయటకు వదలకుండా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు.

గెర్రె విలువ ఇప్పటికే కోటి రూపాయలు పలకడంతో రాజు సింగ్ ఆ గొర్రె పిల్లను రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. కుటుంబంతో కలిసి తన ఇంటిలోనే ఆ గొర్రెను రాజు సింగ్ పెట్టుకున్నాడు. ఒక గొర్రె విలువ రూ. 1 కోటీకి కంటే ఎక్కువ పలుకుతుందని, అయినా ఆ గొర్రెను విక్రయించడాని దాని యజమాని అంగీకరించలేదని తెలుసుకున్న ప్రజలు షాక్ అయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+