వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణం కోసం వెళితే కోరిక తీర్చాలంటూ.: మేనేజర్‌ను కర్ర, చెప్పుతో చితకబాదిన మహిళ(వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

#MeToo ఎఫెక్ట్.. చితకబాదిన మహిళా | Oneindia Telugu

బెంగళూరు: రుణం ఇవ్వాలంటే తన కోరిక తీర్చాల్సిందేనంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బ్యాంకు మేనేజర్‌ను చితకబాదింది ఓ మహిళ. అపర కాళీగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్రతోపాటు చెప్పులతో ఈడ్చి ఈడ్చి తంతూ చితక బాదింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

రుణం కోసం వెళితే ఇంటికి రమ్మన్నాడు

రుణం కోసం వెళితే ఇంటికి రమ్మన్నాడు

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దావణగెరె ప్రాంతానికి చెందిన ఓ మహిళ రుణం నిమిత్తం స్థానిక బ్యాంకుకు వెళ్లింది. రుణం కావాలని అడిగితే మేనేజర్.. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేగాక, రుణం మంజూరు చేసే విషయంపై మాట్లాడేందుకు తన ఇంటికి రమన్నాడు.

వికృత చేష్టలకు విసిగిన మహిళ ఏం చేసిందంటే..

వికృత చేష్టలకు విసిగిన మహిళ ఏం చేసిందంటే..

ఈ క్రమంలో సరేనని చెప్పిన ఆ మహిళ అతని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తన కోరిక తీరిస్తేనే రుణం ఇస్తానని సదరు మెనేజర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ.. మేనేజర్‌ను ఇంట్లో నుంచి జుట్టుపట్టి బయటకు ఈడ్చుకొచ్చింది.

కర్ర, చెప్పులతో చావబాదిన మహిళ

కర్ర, చెప్పులతో చావబాదిన మహిళ

ఆ తర్వాత అతడ్ని కర్ర, చెప్పులతో చావబాదింది. ఈ తతంగాన్నంత వీడియో తీసిన కొందరు ఇంటర్నెట్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. మీడియా కూడా రంగంలోకి దిగడంతో నిజలింగప్ప అనే ప్రాంతానికి చెందిన ఆ మేనేజర్ బాగోతం బయటపడింది.

మహిళపై ప్రశంసల వర్షం

కాగా, బ్యాంకు మేనేజర్‌ను చితకబాదిన బాధితురాలు.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తనను వేధింపులకు దిగిన వెంటనే ఏ మాత్రం భయపడకుండా నిందితుడ్ని చావబాది, విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు సదరు మహిళపై స్థానికులతోపాటు నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

English summary
Confronting a bank manager for allegedly demanding sexual favours, a woman is seen thrashing him on the streets in south Karnataka's Davanagere city, some 260 km from Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X