వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం: భార్యపై భర్త దాడి, వీడియో రికార్డింగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: వివాహేతర సంబంధం పెట్టుకొందనే నెపంతో భార్యను చెట్టుకు కట్టేసి తీవ్రంగా చిత్రహింసలు పాల్జేశాడు ఓ భర్త . ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకంది. గ్రామ పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా భర్త భార్యపై ఈ శిక్షను అమలు చేశాడు. భర్త కొట్టిన దెబ్బలకు తాళళలేక భార్య స్పృహతప్పిపోయింది. అయితే భర్త దెబ్బలు కొడుతుండగా ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అరెస్ట్ చేశారు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఓ ఘోరమైన ఘటన చోటు చేసుకొంది భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపించాడు. ఈ మేరకు గ్రామంలో పంచాయితీ నిర్వహించాడు అయితే పంచాయితీ పెద్దలు భార్యను చెట్టుకు కట్టేసి కొట్టాలని తీర్పు చెప్పారు.

On Video, Woman Tied To Tree, Beaten As People Watch. No One Intervenes

భార్యను చెట్టుకు కట్టేసి భర్త సైకిల్ ట్యూబ్, టైరు తీసుకొని కొట్టాడు. ఆమెను చెట్టు కొమ్మకు వేలాడదీసి కొడుతుండగా చుట్టూ చేరిన జనం వింతగా చూశారు. కానీ, ఏ ఒక్కరూ కూడ ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. భర్త కొట్టిన దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయింది.

అయితే దారుణాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెట్టుకు కట్టేసి కొట్టిన భర్తతో పాటు ఈ శిక్ష విధించిన గ్రామ పెద్దలను అరెస్ట్ చేశారు.

English summary
Tied by the hands to a tree, she wails in pain as each blow lands on her body. The worst side of humanity is laid bare in the disturbing video, difficult to watch. And yet more than a hundred people - mostly men - watch on. Some smile, no one flinches or steps in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X