వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లయిన తొలినాళ్లలో సుష్మా ఫోటో : ట్విట్టర్ లో 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులకు ఉండే బిజీ షెడ్యూల్ కు నేరుగా ప్రజలతో టచ్ లో ఉండడం అన్నిసార్లు కుదరని వ్యవహారం. అందుకే సోషల్ మీడియా ద్వారా జనానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది నేతలు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత విషయాలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ 'సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్' గా నిలుస్తుంటారు.

తాజాగా ఇదే తరహాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ.. హాట్ టాపిక్ గా మారారు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్. బుధవారం నాడు తన పెళ్లిరోజు కావడంతో పెళ్లినాటి ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు సుష్మా స్వరాజ్. తనకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన తన భర్త స్వరాజ్ కౌషల్ తో దిగిన పెళ్లినాటి ఫోటోతో పాటు, మరికొన్ని ఫోటోలను కూడా సుష్మా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో అతిపిన్న వయసులో కేబినెట్ లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా 25 ఏళ్ల వయసులో 1977లో హర్యానా కార్మికమంత్రిగా ఆమె పదవి బాధ్యతలను చేపడుతోన్న ఫోటో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

English summary
External Affairs Minister Sushma Swaraj celebrates her wedding anniversary on Wednesday. Active on Twitter, Swaraj posted a picture from her wedding album, to thank followers who wished her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X