వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘సీఎం సెల్వం రా’!: కబాలి రేంజిలో పేలుతున్న పన్నీరు డైలాగులు(వీడియో)

ప్రస్తుత తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మద్దతుదారులు సోషల్ మీడియాలో ఆయనకు మద్దతు తెలుపుతూ పలు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: 'క‌బాలీ అంటే సినిమాల్లో ముఖం మీద గాటు పెట్టుకొని, మీసాలు మెలి తిప్పి, లుంగీ కట్టుకుని, పాత విలన్ 'హే బిత్తిరి' అనగానే ఒంగొని వినయంగా ఎస్ బాస్.. అని నిలబడుతాడే ఆ కబాలీ అనుకున్నార్రా.. కబాలీ రా' అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ చిత్రంలో వదిలిన డైలాగ్స్ దక్షిణాది జనాన్ని హుషారెత్తించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం త‌మిళంలో ప‌న్నీర్ సెల్వం క‌బాలీలా అయిపోయారంటూ ప‌న్నీర్ మ‌ద్ద‌తుదారులు రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

షాకిచ్చిన శశికళ: గవర్నర్‌కిచ్చిన మద్దతుదారుల జాబితాలో 'పన్నీరు సెల్వం' షాకిచ్చిన శశికళ: గవర్నర్‌కిచ్చిన మద్దతుదారుల జాబితాలో 'పన్నీరు సెల్వం'

ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పాటల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి సెల్వం వీడియోలు విడుదల చేస్తున్నారు. భాషా చూడు అంటూ ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్న సెల్వం వీడియో వైరల్‌ మారింది. అంతేగాక, గురువారం సెల్వం మద్దతుదారులు మరో వీడియో రిలీజ్ చేశారు.

కబాలి డైలాగ్స్‌ను పన్నీర్‌కు అనుకూలంగా మార్చి ఆన్ లైన్‌లోకి వదిలారు. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది. 'అమ్మ ఉన్నప్పుడు బొట్టుపెట్టుకుని, గడ్డం గీయించుకుని, లుంగీ దించుకుని ఉన్నానుకదా అని ఇప్పుడు చిన్నమ్మ వచ్చి రాజీనామా చేయ్యి అనగానే వొంగోని వినయంగా ఎస్ మామ్ అనడానికి పాత సెల్వం అనుకుంటున్నారా? సీఎం సెల్వం రా...' అంటూ ప‌న్నీర్ సెల్వం డైలాగుతో వీడియో విడుద‌లైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

సెల్వం మద్దతుదారులు వ‌దిలిన ఈ వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అంతేగాక‌, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో పాటల్ని బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టి సెల్వం వీడియోలను విడుదల చేస్తున్నారు. వీటితోపాటు బాహుబలి పోస్టర్లను కూడా సెల్వం మద్దతుదారులు తమకు అనుకూలంగా మార్చుకోవడం గమనార్హం.

English summary
Tamil Nadu politics has not seen anything like this for at least three decades – a ruling party on the verge of a split, a mere five MLAs on the side of the challenger to the throne and swirling rumours of over 130 sequestered MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X