పెళ్లి వేడుకల్లో విషాదం: నిర్లక్షానికి చిన్నారి బలి

పాట్నా: బీహార్ లో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. అర్రా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకల్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి బలి అయ్యింది. వివాహ ఊరేగింపులో ఉపయోగించిన బాణా సంచా పేలుడు ఒక్క సారిగా మంటలు అమలుకున్నాయి.

ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా అనేక మందికి గాయాలైనాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదం వలన స్థానికంగా ఆందోళన చెలరేగింది. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

One chiled killed in celebratory firing in Bihar

బాధితులను ఆసుపత్రికి తరలించే సమయంలో స్థానికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. స్థానికులకు నచ్చ చెప్పి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విచ్చల విడిగా, నిర్లక్షంగా పేలుడు పదార్థాలు కాల్చిన వారి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

బీహార్ లో ఎలాంటి వేడుకలు జరిగినా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం ఆనవాయితి. కొందరు గాలిలోకి కాల్పులు జరుపుతారు. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరని పోలీసు అధికారులు అంటున్నారు. కొందరి నిర్లక్షం వలన అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+