గిరీష్ కర్నాడ్ పై కేసులు: క్షమించండి, కర్నాడ్

బెంగళూరు/మండ్య: జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రచయిత, బహుభాష నటుడు గిరీష్ కర్నాడ్ మీద బెంగళూరు నగరంతో పాటు మండ్యలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరీష్ కర్నాడ్ మీద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం)కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమాజంలో శాంతికి భంగం కలిగించారని బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అదే విధంగా కర్ణాటక రక్షణా వేదిక నాయకుడు ప్రవీణ్ శెట్టి మండ్య పోలీస్ స్టేషన్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, గిరీష్ కర్నాడ్ మీద ఫిర్యాదు చేశారు. రెండు పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఫిర్యాదులు స్వీకరించారు.

One complaint was filed in Bengaluru another has been filed in Mandya.

అయితే గిరీష్ కర్నాడ్ వ్యక్తిగతంగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని చెప్పారని, ఆయన మీద ఎలా కేసులు నమోదు చెయ్యాలంటూ న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

నన్ను క్షమించండి....... గిరీష్ కర్నాడ్

గిరీష్ కర్నాడ్ వ్యాఖ్యలతో కర్ణాటక మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్బంలో గిరీష్ కర్నాడ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు చాల మంది నిరసన వ్యక్తం చెయ్యడం తనకు భాద కలిగించిందని, తాను చేసిన వ్యాఖ్యలకు మీరు భాదపడి ఉంటే తనను క్షమించాలని గిరీష్ కర్నాడ్ ప్రజలకు మనవి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+