బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్యాణమండపంలో వరుడి అరెస్టు: పెళ్లి రద్దు

|
Google Oneindia TeluguNews

మంగళూరు: పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఓ వరుడు చివరికి కటకటాలపాలైనాడు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా సుల్యా తాలుకాలోని ఎనేకల్ గ్రామానికి చెందిన అరుణ్ (30) అనే యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

చిక్కమగళూరు జిల్లా ముడిగెరె తాలుకా, జీ హోసహళ్ళికి చెందిన యువతితో అరుణ్ వివాహం నిశ్చయం అయ్యింది. జిన్నాపురలోని కళ్యాణమండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. వరుడు, వధువు కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణమండపం చేరుకున్నారు.

పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడికి అలంకారం చేస్తున్నారు. ఇక పెళ్లిపీటల మీదకు తీసుకు వస్తున్న సమయంలో కళ్యాణమంటపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మీరు ఇలా వచ్చారు ఏంటీ అని పెళ్లి కుమార్తె తండ్రి పోలీసులను ప్రశ్నించారు.

One hour before wedding groom arrested for alleged nurder in Karnataka

పెళ్లి కుమారుడు ఓ హత్య చేశాడని పోలీసులు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అరుణ్ బెంగళూరులో బీఎస్సీ నర్సింగ్ చదివాడు. ఆ సందర్బంలో అతను ఓ వృద్దుడిని దారుణంగా హత్య చేశాడు.

హత్య చేసిన తరువాత అరుణ్ తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కచ్చితమైన వివరాలు సేకరించిన పోలీసులు కళ్యామండపంలో అయితే తప్పించుకోలేడని తెలుసుకుని అక్కడికి చేరుకుని అరెస్టు చేశారు. వరుడు అరెస్టు కావడంతో పెళ్లి రద్దు అయ్యింది.

English summary
Sources say that the police suspected that Arun had murdered his landlady at Bengaluru; he resided in a rented accommodation as he was employed there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X