దంతేరస్ సేల్స్ అదుర్స్, మొత్తం వ్యాపారం లక్ష యాభై వేల కోట్లు..
దీపావళికి ముందు ధన త్రయోదశి (దంతేరస్) ఈ రోజు బంగారు ఆభరణాలు, బంగారం.. లేదంటే వెండి, వెండి వస్తువులు కొనుగోలు చేసిన మంచిదని అంటారు. ఇంట్లో మరింత బంగారం వస్తోందని.. కలిసి వస్తోందని చెబుతుంటారు. దీంతో తాహతుకు తగినట్టు గోల్డ్ కొంటారు. అయితే అదీ గ్రాము కావచ్చు.. అంతకన్నా తక్కువ కూడా కావచ్చు. కెపాసిటీ ఉన్నవారు ఆభరణాలే కొనుగోలు చేస్తారు. అలా దేశంలో భారీగా మార్కెట్ జరిగింది.

పంట పండింది
ఈ సారి దీపావళి 25వ తేదీన అంటే మంగళవారం వచ్చింది. కానీ గ్రహణం వల్ల సోమవారం చేస్తున్నారు. ఆదివారం నరక చతుర్దశి.. శనివారం ధన త్రయోదశి జరుపుకున్నారు. శనివారమే కాక.. ఆదివారం కూడా కొందరు బంగారం కొనుగోలు చేశారు. దీంతో జువెల్లరీ షాపుల వారి పంట పండింది. అనుకున్న దాని కన్నా ఎక్కువే బంగారం కొనుగోలు జరిగింది.

25 వేల కోట్ల వ్యాపారం
ధంతేరస్ సందర్భంగా దేశంలో ఏకంగా 25 వేల కోట్ల విలువైన ఆర్నమెంట్స్ విక్రయాలు జరిగాయి. బంగారం, వెండి నాణేలు, ఆభరణాల అమ్మకాలు భారీగా జరిగాయి. రూ.25,000 కోట్ల విలువైన బంగారు, వెండి నాణేల సేల్స్ జరిగాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది.

45 వేల కోట్ల బిజినెస్
ఆభరణాలు కాక ఇతర వస్తువుల కొనుగోళ్లు జరిగాయి. దేశంలో మొత్తం వ్యాపారం రూ.45,000 కోట్లు దాటింది. ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఫర్నీచర్, అలంకరణకు అవసరమైన వస్తువులు, మిఠాయిలు, స్నాక్ బాక్స్, వంటగది వస్తువులు, అన్ని రకాల పాత్రలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్ వస్తువులో సుమారు రూ. 20,000 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

లక్ష యాభై వేల కోట్లు
ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో కలిపి దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది. ఈ సారి వినియోగదారులు స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడటం పండగ ప్రత్యేకత అని అభిప్రాయపడింది. దీనితో చైనా వ్యాపారంలో రూ. 75,000 కోట్లు తగ్గిందని తెలిపింది.












Click it and Unblock the Notifications