జమిలి..డీలిమిటేషన్ పై బిగ్ ట్విస్ట్ - మోదీ మార్క్ లెక్క: వారికి ఊహించని దెబ్బ..!!
ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్దమవుతున్నారు. ప్రతిపక్షాలు ఊహించని దెబ్బ కొట్టేందుకు కొత్త లెక్కలు సిద్దం చేస్తున్నారు. మోదీ 4.0 లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం.. పార్టీ లో కీలక మార్పులు చేస్తూనే... ప్రతిష్ఠాత్మక బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు తుది కసరత్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా జమిలి ఎన్నికల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ తో పాటుగా జమిలి పైన మోదీ తాజా వ్యూహాలు విపక్షానికి రాజకీయంగా అంతు చిక్కటం లేదు.
బీజేపీ అధినాయకత్వం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. గత సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోవటంతో ఇప్పుడు పూర్తి లెక్కలతో బీజేపీ సిద్దం అవుతోంది. 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్ అమలు దిశగా కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. అదే విధంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ 2029లో అమలు చేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఏపీలో సాధారణ షెడ్యూల్ ప్రకారమే 2029 లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 2028 నవంబర్ లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది.

2029 ఎన్నికలే లక్ష్యంగా
కాగా, 2029 లోనే జమిలి ఎన్నికల కల సాకారమవుతుందని పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌధరి ఆశాభావం వ్యక్తంచేశారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహిస్తే బాగుంటుంది.. ఎదురయ్యే సవాళ్లు ఏమిటి.. వాటిని ఎలా పరిష్కరించాలో గోవా ముఖ్యమంత్రి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలిపారు. దాదాపుగా 99 శాతం మంది జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థించారని.. ప్రస్తుతం అన్ని పార్టీలకూ ఆమోదయోగ్యమైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. తదుపరి లోక్‌సభ ఎన్నికలు జరిగే 2029నాటికి 'ఒక దేశం.. ఒకే ఎన్నిక' కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. దీంతో.. 209 ఎన్నికల నాటికి బీజేపీ నాయకత్వం అనుకున్నట్లుగా అంతా సవ్యంగా జరిగితే కొత్త నియోజకవర్గాలు.. మహిళా రిజర్వేషన్ల తో పాటుగా జమిలి తొలి దశ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు క్షేత్ర స్థాయిలోనూ బీజేపీ సమాయత్తం అవుతోంది. విపక్షాలు ఏం చేస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications