ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రపంచదేశాల సరసన ఒక భాష ద్వారానే భారత్‌ను ఫోకస్ చేయొచ్చని చెప్పారు. హిందీ దివాస్ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. దేశవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాష హిందీ అని ఈ భాషతోనే దేశం మొత్తాన్ని ఏకం చేయొచ్చని చెప్పారు. అంతేకాదు హిందీని ప్రాథమిక భాషగా చేయాలన్న ఆయన... భారత్‌ను బయట ఫోకస్ చేసేందుకు భాష ఉపయోగపడుతుందని చెప్పారు.
భారత్‌లో చాలా భాషలు ఉన్నాయని ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందని చెప్పిన కేంద్రహోంశాఖ మంత్రి... భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని అది అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ఉండాలని చెప్పారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌లు కన్న కలలను సాకారం చేసేందుకు దేశ ప్రజలు హిందీని విరివిగా మాట్లాడటం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

भारत विभिन्न भाषाओं का देश है और हर भाषा का अपना महत्व है परन्तु पूरे देश की एक भाषा होना अत्यंत आवश्यक है जो विश्व में भारत की पहचान बने। आज देश को एकता की डोर में बाँधने का काम अगर कोई एक भाषा कर सकती है तो वो सर्वाधिक बोले जाने वाली हिंदी भाषा ही है। pic.twitter.com/hrk1ktpDCn
— Amit Shah (@AmitShah) September 14, 2019
Recommended Video
ఇదిలా ఉంటే హిందీ దివాస్ సందర్భంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో అత్యధిక ప్రజలు హిందీ మాట్లాడుతారని అదే సమయంలో అతి సులభంగా అర్థం చేసుకోగల భాష హిందీ అని కొనియాడారు. దైనందిత జీవితంలో హిందీని విరివిగా వినియోగించాలని పిలుపునిచ్చారు. హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. హిందీ రచయితలకు, కవులకు, జర్నలిస్టులకు హిందీ భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
हिंदी भारत में सर्वाधिक बोली एवं समझी जाने वाली भाषा है जो हम सभी भारतीयों को एकता के सूत्र में पिरोती है एवं विश्व में हमारी पहचान भी है।
— Jagat Prakash Nadda (@JPNadda) September 14, 2019
आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं।
आइए हम सभी अपने दैनिक जीवन में हिंदी के प्रयोग को बढ़ाएं एवं दूसरों को भी प्रेरित करें। pic.twitter.com/GAK1MWFezk
ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో హిందీ భాషను దేశ అధికారిక భాషగా చేర్చిన రోజున హిందీ దివాస్ జరుపుకుంటున్నాము.












Click it and Unblock the Notifications