కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా.. మరణం నుంచి 80శాతం తప్పించుకోవచ్చు
న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ డోసు ఒక్కటి తీసుకుంటే.. కరోనా బాధితులను 80 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్(పీహెచ్ఈ) తెలిపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న తర్వాత 80 శాతం వరకు, రెండో డోసు వేసుకున్న తర్వాత 97 శాతం వరకు మరణం నుంచి కాపాడుతుందని వెల్లడించింది.
వాస్తవిక పరిస్థితులను బట్టి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మరణాలను తగ్గిస్తుందని పీహెచ్ఈ పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు 28 రోజుల్లో కరోనాతో చనిపోయినవారి డేటాను పరిశీలించగా.. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు నిలుపుకున్నారని తెలిపింది.

వ్యాక్సిన్ వేసుకోని వారికంటే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నవారు 55 శాతం మంది, ఫైజర్ డోసు వేసుకున్నవారు 44 శాతం మంది మరణం నుంచి తప్పించుకుంటున్నారని వెల్లడించింది. కరోనా బాధితులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు వేసుకోవడం ద్వారా 80 శాతం మరణం నుంచి రక్షణ పొందుతున్నారని పీహెచ్ఈ తన అధ్యయనంలో వెల్లడించింది.
ఇక ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ కరోనా వచ్చే రెండు వారాల ముందు వేసుకున్నా.. మరణం నుంచి 69 శాతం రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకుంటే 97 శాతం రక్షణ కల్పిస్తుందని పీహెచ్ఈ తెలిపింది.
Recommended Video
కరోనా కేసులు అదుపులోకి రావడంతో ఇంగ్లాండ్ దేశంలో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రధానమంత్రి బోరీస్ జాన్సన్ వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం ద్వారా 80ఏళ్లకుపైబడినవారు 93 శాతం ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోందని మరో అధ్యయనం తేల్చింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications