ఐలవ్ యూ, చాన్స్ ఇవ్వాలని ఆర్ టీసీ బస్ స్టాండ్ లో వివాహిత మహిళను కత్తితో పొడిచేసి !
బెంగళూరు/చిక్కబళ్లాపురం: తన ప్రేమను అంగీకరించలేదని వివాహిత మహిళను కత్తితో పొడిచిన ప్రియుడు తరువాత అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన బెంగళూరు నగర శివార్లలోని అత్తిబెలె పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాప్ లో చోటుచేసుకుంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా బాగేపల్లికి చెందిన జయలక్ష్మి కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
బాగేపల్లికి చెందిన శ్రీనివాసులు అనే పిచ్చి ప్రేమికుడు అతనుకూడా పదేపదే కత్తితో పొడుచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అత్తిబెలె పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న బీరప్ప కూడా కత్తి పోట్లకు గురై గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. భర్త నుంచి విడిపోయిన జయలక్ష్మి బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది.

బాగేపల్లి నుంచి అనేకల్‌కు వచ్చిన శ్రీనివాసులు జయలక్ష్మి మోజులో పడిపోయి ఆమె అంటే పడిచచ్చిపోయాడని తెలిసింది. నీ కోసం తాను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని, నువ్వు నాకు కావాలని, తనను పెళ్లి చేసుకోవాలని వన్ సైడ్ లవర్ శ్రీనివాసులు భర్తకు దూరంగా ఉంటున్న జయలక్ష్మి మీద ఒత్తిడి చేస్తున్నాడని తెలిసింది. అయితే శ్రీనివాసులు గురించి పూర్తిగా తెలిసిన జయలక్ష్మి అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది.
పిచ్చి ప్రేమికుడు శ్రీనివాసులు బుధవారం కూడా జయలక్ష్మిని ప్రేమించమని చెప్పాడు. నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని జయలక్ష్మిని ఆమె వన్ సైడ్ లవర్ శ్రీనివాసులు బెదిరించాడు. బీరు బాటిల్ పగలగొట్టిన శ్రీనివాసులు ఆ గాజు సీసాతో చేతులు కోసుకుని జయలక్ష్మిని బెదిరించాడు. శ్రీనివాసుల నుంచి తప్పించుకునేందుకు జయలక్ష్మి ప్రయత్నించింది.
అత్తిబెలె నుంచి సొంత ఊరు బాగేపల్లి వెళ్లేందుకు బస్టాప్‌లోకి వెళ్లిన జయలక్ష్మి బస్సు కోసం నిలబడి ఉంది. అదే సమయంలో బస్ స్టాండ్ లోకి వెళ్లిన శ్రీనివాసులు మరోసారి తనను ప్రేమించాలని జయలక్ష్మీ మీద ఒత్తిడి చేశాడు. అదే బస్ స్టాండ్ లో జయలక్ష్మితో శ్రీనివాసులు గొడవపడ్డాడు. ఆ సందర్బంలో అక్కడ రచ్చరచ్చ అయ్యింది.

ఇంతలో అక్కడికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ బీరప్ప పిచ్చి ప్రేమికుడు శ్రీనివాసులను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో రెచ్చిపోయిన శ్రీనివాసులు కత్తితో హెడ్ కానిస్టేబుల్ బీరప్పను పొడిచేశాడు. తరువాత పిచ్చోడు శ్రీనివాసులు అదే కత్తితో పొడుచుకుని అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
ఎస్ఐ నారాయణరావు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శ్రీనవాసులను అదుపులోకి తీసుకుని ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన జయలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ బీరప్పను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, కేసు విచారణలో ఉందని ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ మీడియాకు చెప్పారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications