ఎన్నికల ప్రచారంలో కాక పుటిస్తోన్న తెలంగాణ గవర్నర్ రాజీనామా
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందరరాజన్.. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోండటం దుమారం రేపుతోంది. రాజ్యాంగబద్ధ పదవిలో కొనసాగిన తరువాత మళ్లీ రాజకీయాల్లోకి రావడం వివాదాలకు కేంద్ర బిందువు అయింది.
తెలంగాణ గవర్నర్‌గా అయిదు సంవత్సరాల పాటు పని చేశారు.. తమిళిసై సౌందరరాజన్. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా కూడా సేవలను అందించారు. ఇటీవలే ఈ రెండు పదవులకు రాజీనామా చేశారు. రాజ్ భవన్ నుంచి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు. ఆమె స్వరాష్ట్రం తమిళనాడు. గతంలో తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చెన్నై నార్త్ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా తూత్తుకుడి నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. పరాజయం పాలయ్యారు. ఆ తరువాతే తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ అయ్యారు.
ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు తమిళిసై సౌందరరాజన్. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గవర్నర్, లెప్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండో రోజే తమిళిసై బీజేపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చెన్నైలో కిషన్ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారామె.
గవర్నర్‌గా పని చేసిన తమిళిసై రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇదే అంశాన్ని డీఎంకే తన ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచుకుంది. డీఎంకే నాయకురాలు, తూత్తుకుడి ఎంపీ అభ్యర్థి కణిమోళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి అసలు అభ్యర్థులే లేరని, అందుకే తమిళిసై సౌందరరాజన్‌తో రాజీనామా చేయించి మరీ ఇక్కడికి తెచ్చిందని విమర్శించారు.
చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, పార్టీ అభ్యర్థి తమిళాక్షి తంగపాండ్యన్ తరఫున కణిమోళి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నై సౌత్‌లో పోటీ చేయడానికి ఒక రాష్ట్ర గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని విమర్శించారు. గతంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఒక రాష్ట్ర గవర్నర్‌గా పని చేశారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications