నౌగామ్‌లో మరో ఉగ్రవాది హతం: ఆధారాలతో బయటపడిన పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: పాక్ నుంచి భారత్ వైపు ఉగ్రవాదుల చొరబాటు ఆగడం లేదు. హంద్వారా అనంతరం నౌగామ్ సెక్టారులో ఓ ఉగ్రవాదిని ఆర్మీ ఎన్‌కౌంటర్ చేసింది. కుప్వారా జిల్లాలోని హంద్వారా వద్ద గల నౌగామ్ సెక్టారులో ఓ ఉగ్రవాది చొరబాటుకు ప్రయత్నించగా కాల్చి చంపారు.
కాగా, హంద్వారాలో పాకిస్థాన్ పాపం మరోసారి బయటపడింది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే ఉగ్రమూకను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కుట్రకు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయి. హంద్వారాలో లాంగేట్ వద్ద సరిహద్దు ఫెన్సింగ్ దాటి ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. హోరా హోరీ పోరులో ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాల్పుల అనంతరం ఘటనాస్థలంలో 3 ఏకే 47లు, లాంచర్లు, ఫుడ్ ప్యాకెట్లు, ఇంజక్షన్లు, మ్యాప్‌లు, జీపీఎస్ పరికరాలు, రేడియో సెట్‌లు, మ్యాట్రిక్ షీట్స్ స్వాధీనం చేసుకున్నారు.
హంద్వారా ఆపరేషన్ ముగిసిన అనంతరం సైనిక అధికారులు మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయన్నారు. వారి వద్ద లభ్యమైన పరికరాలు ఓబీఎస్ పాకిస్థాన్ ప్రై.లిమిటెడ్ సంస్థ తయారు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇంజక్షన్‌లు కూడా పాకిస్థాన్‌లోనే తయారైనట్లు గుర్తించామన్నారు. ముగ్గురు ముష్కరులు హతమవడంతో హంద్వారా ఆపరేషన్ ముగిసిందన్నారు. జవాన్లు అప్రమత్తంగా ఉండి ముష్కరులను దీటుగా ఎదుర్కొన్నారని అభినందించారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications