ఉద్యోగార్థుల కోసం వన్ ఇండియా జాబ్స్ పోర్టల్
బెంగళూరు: ఉద్యోగాల కోసం ఆరా తీసుకునే వారి కోసం లాంగ్వేజ్ పోర్టల్స్‌లో ప్రథమ స్థానంలో ఉన్న వన్ ఇండియా ఇప్పుడు జాబ్ సర్చ్ పోర్టల్(ఉద్యోగాలు శోధన పోర్టల్)ను ప్రారంభించింది. వన్ ఇండియా ఉద్యోగాల అన్వేషణ పోర్టల్ ఉద్యోగాల శోధనలో మార్కెట్ లీడర్ అయిన ఇండీడ్.కో.ఇన్ (Indeed.co.in) ఆధారంగా ఏర్పాటు చేసింది.
జాబ్స్.వన్ ఇండియా.ఇన్(Jobs.oneindia.in) పోర్టల్ ద్వారా వేలాది వెబ్ సైట్లు, జాబ్ బోర్డ్స్, వార్త పత్రికలు, అసోసియేషన్స్, కంపెనీల కెరీర్ పేజీలలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పొందవచ్చును. మీకు కావాల్సిన ప్రదేశాలలో, మీకు కావాల్సిన ఉద్యోగాల వివరాలను ఈ పోర్టర్ ద్వారా అన్వేషించవచ్చు. వన్ ఇండియా ఉత్పత్తులు గానీ సేవలు గానీ ప్రజలకు ఉపయోగపడి వారి జీవితాలను సులభతరంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి సహకరిస్తున్నాయి. ఇలాంటి పోర్టల్ నుంచి ప్రస్తుతం ఉద్యోగార్థుల కోసం వివిధ అవకాశాలను అందించేందుకు జాబ్ సర్చ్ పోర్టల్ రావడం స్వాగతించదగిన విషయం. జాబ్ సర్చ్ పోర్టల్‌కు సంబంధించిన విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం..

1. మీరు జాబ్ ప్రొఫైల్‌ని, ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని జాబ్ సర్చ్‌ని ప్రారంభించవచ్చు.
2. అడ్వాన్స్‌డ్ జాబ్ సర్చ్‌తో వివిధ రంగాలలో ఉన్న మెరుగైన ఉద్యోగ అవకాశాలను పోర్టల్ ద్వారా పొందవచ్చు.
3. ప్రదేశాన్ని బట్ట అంటే ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై లాంటి నగరాల్లో ఉద్యోగ అవకాశాలను పోర్టల్ ద్వారా పొందవచ్చు.
4. రంగాల పరంగా అంటే టెక్నాలజీ జాబ్స్, లేదా అకౌంట్స్, బిపిఓ, మీడియా, ఇన్స్యూరెన్స్, సేల్స్ లాంటి ఉద్యోగ అవకాశాలను ఎంచుకుని అన్వేషించవచ్చు.
5. హోదా పరంగా కూడా మీరు ఉద్యోగ అవకాశాలను అన్వేషించవచ్చు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, డాటా అనలిస్ట్, డెస్క్ టాప్ ఇంజినీర్, జావా డెవలపర్, డిజైనర్,
6. ఉద్యోగ అవకాశాలు తేదీల వారీగా, ప్రమాణాల ఆధారంగా రూపొందించబడిన జాబితా పోర్టల్‌లో పొందవచ్చు.
jobs.oneindia.com ఉపయోగం
ఒక సారి మీరు మీకు కావాల్సిన ఉద్యోగానికి సంబంధించిన వివరాలను పోర్టల్‌లో టైప్ చేసినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, ఉద్యోగం ఆఫర్ చేసిన యాజమాన్య సంస్థ యొక్క వెబ్‌సైట్ మీకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీరు ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంప్లాయర్‌కి ఉపయోగం
ఉద్యోగాలను ఆఫర్ చేసే సంస్థలకు, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న ఉద్యోగార్థులకు మధ్య ఒక వారధిలా jobs.oneindia.com పని చేస్తుంది. తమకు కావాల్సిన ఉద్యోగ అవకాశాల వివరాలను యాజమాన్య సంస్థలు ఈ పోర్టల్‌లో ఉంచడం ద్వారా వారికి కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎప్పుడూ తమకు అండగా నిలుస్తున్న వారందరికీ వన్ ఇండియా కృతజ్ఞతలు చెబుతోంది.












Click it and Unblock the Notifications